Begin typing your search above and press return to search.
బీజేపీ కోసం టీడీపీ అతి పెద్ద త్యాగం... ?
By: Tupaki Desk | 30 Oct 2021 12:30 AM GMTఏపీలో టీడీపీకి అధికారం ఎలా దక్కుతుంది అన్నదే పసుపు శిబిరంలో సాగుతున్న చర్చ. దారుణమైన నంబర్ కి పడిపోయి 2019 ఎన్నికలలో దెబ్బ తిన్న తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీకి అయితే పొలిటికల్ గా హైప్ రావడం లేదు. గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేసింది. దాని చేదు ఫలితాన్ని చవి చూసింది. ఈసారి మాత్రం అలాంటి ప్రయత్నాలు అసలు చేయకూడదని టీడీపీ అనుకుంటోంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో తెర వెనక గుడ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తోంది అన్న ప్రచారం ఉంది. ఇక మిగిలింది బీజేపీ. ఆ పార్టీ కనుక కరుణిస్తే ఏపీలో టీడీపీకి తిరుగు ఉండదు అంటున్నారు. అయితే టీడీపీకి బీజేపీ పడిపోవడానికి అది 1999, 2014 నాటి రోజులు కావని అంటున్నారు.
ఈసారి బీజేపీ బాగా బెట్టు చేసే అవకాశాలు ఉన్నాయట. ఏదో పదో పన్నెండో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి బీజేపీ చలవతో మొత్తం పవర్ ని టీడీపీ సొంతం చేసుకుంటే చూస్తూ ఊరుకోమని అంటున్నారు కమలనాధులు. దాన్ని పసిగట్టిన టీడీపీ కూడా బాగా తగ్గి ఉండాలనే ఆలోచిస్తోందిట. దీంతో బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ వైపు నుంచి రాయబేరాలు ఒక లెవెల్ లో సాగుతున్నాయని అంటున్నారు. ఏపీ బీజేపీకి ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు చాన్స్ లేకపోవచ్చు కానీ పొత్తు పేరిట వస్తే మాత్రం టీడీపీ లాంటి పార్టీలకు గరిష్టంగా లాభం కలుగుతుంది.
దాంతో ఈసారి బీజేపీ కూడా ఎక్కువ సీట్లు పట్టుపట్టే అవకాశం ఉంది అంటున్నారు. కనీసం యాభైకి తక్కువ కాకుండా ఎమ్మెల్యే సీట్లు తీసుకుని ఎంపీ సీట్లలో సగానికి సగం అంటే 13 సీట్లను కోరాలని కూడా భావిస్తున్నారుట. అలా కనుక ఒప్పుకుంటే మాత్రం టీడీపీతో పొత్తుకు బీజేపీకి ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవు అంటున్నారు. దీని మీద టీడీపీలో కూడా హాట్ హాట్ చర్చ సాగుతోంది. బీజేపీ వంటి పార్టీ పొత్తుకు ఒప్పుకుంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ కూడా రెడీ అంటున్నారు. అయితే టీడీపీ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయటే ఎంపీ సీట్లు సగానికి సగం ఇస్తామని ఎమ్మెల్యే వరకూ అయితే పాతిక వరకూ ఇచ్చుకోగలమని అంటున్నారుట.
మరో వైపు జనసేన కూడా ఉంటుంది. ఆ పార్టీకి కూడా యాభై దాకా ఎమ్మెల్యే సీట్లు టీడీపీ ఇవ్వాలి. ఇలా చూసుకుంటే మొత్తం 175 సీట్లకు గానూ 2024లో టీడీపీ కచ్చితంగా పోటీ చేసేది కేవలం వంద వరకూ మాత్రమే సీట్లు ఉంటాయని అంటున్నారు. అయితే బీజేపీ యాభై సీట్లకు పట్టుబడితే పొత్తు ఎత్తులు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి. ఏది ఏమైనా టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమనే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన నాయకులు అంటున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్న మాటలను ఈ సందర్భంగా గమనంలోకి తీసుకుంటే ఏపీ రాజకీయాలలో ఎన్నో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.