Begin typing your search above and press return to search.
టీడీపీ-బీజేపీ ఏకమయ్యాయా ?
By: Tupaki Desk | 30 Oct 2021 7:40 AM GMTకడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీ-బీజేపీ నేతలు ఏకమయ్యారా ? అవుననే అంటున్నారు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. బీజేపీకి టీడీపీ మద్దతు పలకటమంటే కాస్త విచిత్రంగానే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే బద్వేలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీకి ఏమాత్రం బలంలేదు. పార్టీ ఎంత బలహీనంగా ఉందంటే కనీసం 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని దయనీయస్ధితిలో ఉంది.
ఉపఎన్నికలో కనీసం పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చోబెట్టలేకపోతే పరువు పోతుందని దాదాపు రెండువారాలుగా టీడీపీ నేతలకు కమలనాదులు గాలమేస్తున్నారు. టీడీపీ ఎలాగూ పోటీలో లేదుకాబట్టి తమ పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోమని తమ్ముళ్ళని బతిమలాడుకుంటున్నారు. బీజేపీ అభ్యర్ధి సురేష్+కీలక నేత ఆదినారాయణరెడ్డి అండ్ కో కాశీనాయనపల్లి మండలంలోని టీడీపీ నేత వెంకటరెడ్డి ఇంటికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు.
దాదాపు రెండు వారాల క్రితం వరకు కేవలం పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటే చాలని చర్చలు జరిపిన కమలనాదులు వారం క్రితం నుండి టీడీపీ ఓట్లను బీజేపీ అభ్యర్ధికి వేయించాలని బేరాలు పెట్టినట్లు సమాచారం. టీడీపీ ఓట్లు వృధాగా పోకుండా తమ పార్టీకి వేయిస్తే దానికితగ్గ ప్రతిఫలం ఉంటుందని ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. టీడీపీ మాజీ ఎంఎల్ఏ విజయమ్మ కొడుకు రితేష్ రెడ్డితో కొందరు కమలనాదులు ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే బీజేపీ నేతల ప్రలోభాలకు, గాలానికి తమ్ముళ్ళు తగులుకున్నారా లేదా అన్నది మొదట్లో తేలలేదు. కానీ ఈరోజు పోలింగ్ సందర్భంగా గమనిస్తే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ శ్రేణులు కనిపించాయనే ప్రచారం పెరిగిపోతోంది. అంటే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవటానికి సిద్ధపడిన టీడీపీ నేతలు మరి తమ ఓట్లను కూడా వేయించటానికి సిద్ధపడ్డారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
నిజానికి బీజేపీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 735 మాత్రమే. కమలంపార్టీకి ఏ ఎన్నికలో కూడా పోటీచేసేంత బలంలేదు. అలాంటిది ఇపుడు పోటీలోకి దిగిందంటేనే కారణం అర్ధమైపోతోంది. పోటీలో లేని ఇతర పార్టీల నేతల సేవలను, ఓట్లను వేయించుకునే ప్లాన్ చేసినట్లు మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలింగ్ రోజున జరిగిన పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో సక్సెస్ సాధించినట్లే కనబడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం ఎలాగుంటుందో చూడాలి.