Begin typing your search above and press return to search.

టీడీపీ దుకాణం బంద్ చేయడమేనా?

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:43 AM GMT
టీడీపీ దుకాణం బంద్ చేయడమేనా?
X
టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉండే ఇటీవలే బీజేపీలో చేరిన సుజనా చౌదరి హాట్ కామెంట్ చేశారు. త్వరలోనే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని.. తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. అయితే వల్లభనేని వంశీ లాంటి టీడీపీ అసమ్మతి నేత ఒక్క మాట అన్నందుకే రెచ్చిపోయి రొచ్చు రొచ్చు చేశారు మన చంద్రబాబు, లోకేష్ లు. ఇప్పుడు సుజనాచౌదరి టీడీపీ మొత్తం ఖాళీ చేస్తామన్నా కూడా పల్లెత్తు మాట కూడా అనకపోవడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై అవాకులు, చెవాకులు పేల్చిన చిన్న బాబు లోకేష్.. తాజాగా సుజనా చౌదరి వ్యాఖ్యలపై మాత్రం తాను మాట్లాడను అని తేల్చారు. దీంతో సుజనా చౌదరిని బీజేపీలోకి పంపించింది చంద్రబాబే అన్న వాదనకు లోకేష్ బాబు బలం చేకూర్చినట్టైంది.

టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం చంద్రబాబుదే కీరోల్ అని పొలిటికల్ వర్గాల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలానే సుజనాచౌదరి, సీఎం రమేష్ లు ఎన్ని తిట్లు తిట్టినా.. టీడీపీని కబళిస్తామంటున్నా చంద్రబాబు, లోకేష్ లు నోరు మెదపడం లేదు.

దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే.. టీడీపీ ఇలా కునారిల్లితే 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు బీజేపీలోకి కలిసిపోయి ఏపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ సాగుతోంది. బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం.. తన ఎమ్మెల్యేలను పంపించడం చూస్తున్నాక చంద్రబాబు కూడా ఎప్పుడో ఒకప్పుడు బీజేపీలో చేరి టీడీపీ దుకాణం బంద్ చేయడం గ్యారెంటీ అని పరిశీలకులు భావిస్తున్నారు.