Begin typing your search above and press return to search.

బాబు-బందోబ‌స్తు-కొన్ని విమ‌ర్శ‌లు-మ‌రికొన్ని వివ‌ర‌ణ‌లు

By:  Tupaki Desk   |   31 Dec 2022 12:30 AM GMT
బాబు-బందోబ‌స్తు-కొన్ని విమ‌ర్శ‌లు-మ‌రికొన్ని వివ‌ర‌ణ‌లు
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు రోడ్ షోలో అప‌శృతి చోటు చేసుకుని ఏకంగా 8 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. వీరి విష‌యంలో ముందు సంతాపం తెలిపిన వైసీపీ నేత‌లు..త‌ర్వాత‌.. ఈ త‌ప్పు బాబుదేన‌ని ప్ర‌క‌టించి.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, కేంద్రం నుంచి కూడా సంతాపం వ్య‌క్త‌మైంది. ఇదిలావుంటే.. ఇప్పుడు టీడీపీ మ‌రో వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది.

అదేంటంటే.. త‌మ నేత ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని తెలిసినా.. పోలీసులు స‌రైన బందోబ‌స్తు ఇవ్వ‌లేద‌ని.. పోలీసులు క‌నిపించ‌లేద‌ని.. క‌నీసం.. బారికేడ్లు కూడా పెట్ట‌లేద‌ని.. టీడీపీ నాయ‌కులు అంటున్నారు. అదేస‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌టించినా.. వెంట‌నే అక్క‌డ ప‌ర‌దాలు కట్ట‌డంతోపాటు .. హాజ‌ర‌య్యే జ‌నాల‌కు డబుల్ సంఖ్య‌లో పోలీసుల‌ను పెడుతున్నార‌ని.. వ్యాఖ్యానించారు.

దీనికి ఉదాహ‌ర‌ణ‌గా.. కొన్ని విష‌యాల‌ను కూడా వారు ప్ర‌స్తావించారు. 1000 మంది జ‌నాలు వ‌స్తే.. ఏకంగా 2 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని.. అదే చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌కు 50 వేల మంది ప్ర‌జ‌లు వ‌స్తే.. క‌నీసం 200 మంది పోలీసుల‌ను కూడా పెట్ట‌డం లేద‌ని అన్నారు. దీంతో ఇది ఇప్పుడు భ‌ద్ర‌త విష‌యంపై చ‌ర్చ‌కు దారితీసింది.

కానీ, వైసీపీ నేత‌లు మ‌రో వాద‌న తెర‌మీదికి తెస్తున్నారు. ప్రొటోకాల్ ప్ర‌కారం.. భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశార‌ని అన్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్నార‌ని.. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ఎక్కువ‌గా భ‌ద్ర‌త ఉంటుంద‌ని.. చంద్ర‌బాబు మాజీ సీఎం, ఎమ్మెల్యేగా ఉన్నార‌ని.. సో.. దాని ప్ర‌కారం భ‌ద్ర‌త ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ 150 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నార‌ని.. కానీ, చంద్ర‌బాబు బ‌లం కేవ‌లం 23 మాత్ర‌మేన‌ని గుర్తు చేస్తున్నారు. అయితే.. దీనిని టీడీపీ నేత‌లు ఖండిస్తున్నారు. ఇదేం న్యాయం అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.