Begin typing your search above and press return to search.
వైసీపీలో చేరేందుకు ఆ స్వామీజికి ఆహ్వానం
By: Tupaki Desk | 24 May 2016 6:57 AM GMTశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేసే వారిలో ముందుండే స్వరూపాపై ఇపుడు బ్రాహ్మణ నాయకులు మండిపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో స్వరూపానందేంద్ర ఒప్పందం కుదుర్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా అవగాహన బదులు ఆ పార్టీలో చేరాలంటూ ఆఫర్ పెట్టారు.
ఇంతకీ విషయానికొస్తే...విజయవాడ కేంద్రంగా ఇటీవల ‘విప్రోత్సవం’ పేరిట బ్రాహ్మణ సంఘాలు నిర్వహించిన సదస్సుకు హాజరైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ... టీడీపీ సర్కారు - బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ ద్వారా మంజూరవుతున్న రుణాలు టీడీపీకి చెందిన వారికే అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ గుంటూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తో కుమ్మక్కైన స్వరూపానందేంద్ర... పేద బ్రాహ్మణుల కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ పై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. అయినా స్వరూపానందేంద్ర చెప్పడం వల్ల సీఎం చంద్రబాబు ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయలేదని ఆయన వివరించారు. రాజకీయాలు చేయాలనుకుంటే... స్వామిజీ ముసుగు తీసివేసి వైసీపీలో చేరి అప్పుడు మాట్లాడాలని ఆయన స్వరూపానందేంద్రకు సూచించారు.