Begin typing your search above and press return to search.

మరో రెండేళ్ళలో జగన్ ... ?

By:  Tupaki Desk   |   5 Oct 2021 12:30 PM GMT
మరో రెండేళ్ళలో జగన్ ... ?
X
అవును రెండేళ్ళల్లో ఏపీలో ఏం జరగనుంది. అంటే ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే సగం పాలన పూర్తి అయింది కాబట్టి మిగిలిన కాలం పూర్తి అయితే కచ్చితంగా వచ్చేవి ఎన్నికలే. మరి ఆ ఎన్నికల కోసమే అందరూ ఉగ్గబట్టి ఎదురు చూసేది. మరి ఆ ఎన్నికలు వస్తూనే ఏం చేస్తాయి అంటే అర్జంట్ గా జగన్ని గద్దె దించేస్తాయని విపక్షాలు భవిస్తున్నాయి. ఆ మాత్రం ధీమా ఉండాల్సిందే. కానీ అది అతి ధీమా కారాదు. అయితే ఇప్పటి నుంచే విపక్ష నేతలు మాత్రం జగన్ ఉండేది మరో రెండేళ్ళు మాత్రమే అంటున్నారు. జగన్ ఏపీ మాజీ సీఎం గా మిగిలిపోతారని కూడా జోస్యం చెబుతున్నారు. కొందరు ఉత్సాహవంతులైన రాజకీయ నేతలు అయితే 2023 నాటికి జగన్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని కూడా జాతకం చెప్పేస్తున్నారు. అసలు ఇంతకీ ప్రతిపక్షాలకు ఎందుకీ ఆర్భాటం, ఎందుకీ తొందరతనం అంటే అదే పవర్ పాలిటిక్స్ అనుకోవాలేమో.

ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే మరో రెండేళ్ల తరువాత ఏపీలో వైసీపీ సర్కార్ ఉండదని అనేస్తున్నారు. విశాఖ లో భూములు అమ్మేస్తున్నారని, ఎవడబ్బ సొత్తు అని అమ్ముతారని కూడా టీడీపీ తమ్ముళ్లు గర్జిస్తున్నారు. విశాఖతో సహా ఉత్తరాంధ్రాను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరి మీద ఉందని, రెండేళ్ల తరువాత ఇంటికి వెళ్ళిపోయే వైసీపీ ప్రభుత్వానికి ఏం బాధ ఉంటుందని కూడా అయ్యన్న లాంటి వారు సెటైర్లు వేస్తున్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అయితే 2023లోనే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యాలు వదులుతున్నారు.

మరి 2023లో ఏ పరిణామాలు జరుగుతాయి. ఎందుకు జగన్ సర్కార్ పడిపోతుంది అన్న దానికి ఆయన సరైన ఆధారాలు కానీ సమాచారాన్ని కానీ చెప్పడం లేదు. జగన్ మాజీ కావడం మాత్రం కచ్చితమని బల్లగుద్దుతున్నారు. ఇక బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే ఈ మధ్య జగన్ మాట ఎత్తితే గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఏపీలో అసమర్ధ పాలన సాగుతోంది. జగన్ని ఎన్నుకుని జనాలు తప్పు చేశారు అనేస్తున్నారు. ఈసారి వారు ఈ తప్పు చేయరనే అనుకుంటానని కూడా ధీమాగా చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఇక్ ఇక అధికారం కల్ల అన్నది ఈ కమలనాధుడి భాష్యంగా ఉంది.

వీరందరి కంటే టీడీపీ అధినాయకత్వం ధీమా కూడా వీర లెవెల్లో ఉంది. వచ్చేది మా సర్కారే అంటూ అపుడే అక్కడ మంత్రి పదవుల కోసం హడావుడి మొదలెట్టిన వారూ ఉన్నారు. బాబు క్యాబినెట్ లో హోమ్ మంత్రిని నేనే అని ఆ మధ్యన అచ్చెన్నాయుడు బాహాటంగానే చెప్పేశారు. వన్ టైం సీఎం జగన్ అని తమ్ముళ్ళు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యన ఏపీలో టూర్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే 151 సీట్లు వచ్చిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు వస్తే గొప్పేనని సంచలన వ్యాఖ్యలే చేశారు. జగన్ మాజీ సీఎం అని కూడా పేర్కొన్నారు.

జనసేన ఏపీలో అధికారంలోకి రాబోతోంది అని ఆయన పక్కాగా చెబుతుననరు. మొత్తానికి విపక్షాల ఉత్సాహం బాగుంది. వారి ఆశలు ఆకాంక్షలు కూడా బాగానే ఉన్నాయి. కానీ జగన్ని ఓడించడం అంత సులువా. లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నింటా గెలిచిన వైసీపీ ని ఇంత ఈజీగా ఎందుకు విపక్షాలు పక్కన పెడుతున్నాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. మరో వైపు చూస్తే బద్వేల్ ఉప ఎన్నికల వేళ మేము పోటీకి దూరం అంటున్న విపక్షాలు జగన్ని మరో రెండేళ్ళలో ఓడిస్తామంటే సొంత పార్టీ క్యాడర్ అయినా నమ్ముతోందా అన్నదే అతి పెద్ద డౌట్.