Begin typing your search above and press return to search.
తెలుగుదేశంలో సంక్షోభం..వాళ్లంతా చంద్రబాబుకు దూరం?
By: Tupaki Desk | 26 Sep 2019 10:59 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో నిర్వహిస్తూ వస్తున్న పార్టీ మీటింగులకు మెజారిటీ నేతలు మొహం చాటేస్తూ ఉన్నారని తెలుస్తోంది. టెలికాన్ఫరెన్స్ ల రూపంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నేతలందరితోనూ ఒకేసారి మాట్లాడటం రివాజే. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ మీటింగులను తరచూ నిర్వహిస్తూ ఉంటారు.
ఆయా పార్టీల నేతలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు వెళ్లి టెలికాన్ఫరెన్స్ మీటింగులకు అటెండ్ అవుతూ ఉంటారు. అయితే అలా హాజరయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పడిపోతోందని సమాచారం. చాలా మంది నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగులకు మొహం చాటేస్తూ ఉన్నారని తెలుస్తోంది.
ఒక లెక్క ప్రకారం..గెలిచిన ఎమ్మెల్యేల్లో పదకొండు మంది - టీడీపీ నియోజకవర్గాల ఇన్ చార్జులుగా ఉన్న వారిలో మరో నూటా తొమ్మిది మంది ఇప్పుడు పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు దూరం అయ్యారని సమాచారం. చంద్రబాబు నాయుడు నిర్వహించే టెలీకాన్ఫరెన్స్ మీటింగులకు వీళ్లంతా మొహం చాటేస్తున్నారని తెలుస్తోంది.
రోజు రోజుకూ తన మీటింగులకు హాజరయ్యే నేతల సంఖ్య తగ్గుముఖం పట్టడం పట్ల చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపోతున్నారని టాక్. ఎవరెవరు రావడం లేదు, ఎంతమంది రావడం లేదు..అనే అంశాల గురించి చంద్రబాబు నాయడే లెక్క వేయించగా..పదకొండు మంది ఎమ్మెల్యేలు - నూటా తొమ్మిది మంది నియోజకవర్గాల ఇన్ చార్జిలు టచ్ లో లేరని తేలిందని తెలుగుదేశం వర్గాలే చెబుతున్నాయి. ఇంతమంది నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరం కావడం అంటే.. అది సంచలనం అని, తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ సంక్షోభంలో ఉన్నట్టే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.