Begin typing your search above and press return to search.
బాబు పై బుడ్డోడి ఆకాంక్ష..సోషల్ మీడియాలో వైరల్
By: Tupaki Desk | 3 Jun 2019 4:33 PM GMTతమను తాము ఆకాశానికెత్తుకోవడంలో టీడీపీ నేతలను - ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ను మించి నోళ్లు లేరనే చెప్పాలి. గెలిస్తే తమదే ఘనత - ఓడితే మాత్రం తప్పంతా ఇతరులదేననే రీతిలో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు ఇప్పుడు తాజా ఎన్నికల్లో దక్కిన ఘోర పరాభవం తర్వాత కూడా కనువిప్పు కలగదేలనే చెప్పాలి. ఓటమి పరాభవంతో తప్పనిసరి అయితే గానీ బయటకు రాలేకపోతున్న చంద్రబాబు... ఇప్పుడు తనదైన శైలి ఓదార్పు యాత్రలకు శ్రీకారం చుట్టారు. టీడీపీని ఓడించి ఏపీ ప్రజలు పెద్ద తప్పే చేశారన్న కోణంలో కొనసాగుతున్న ఈ యాత్రల్లో బాబు ఇంటికి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం కూడా ఓ నాలుగేళ్ల బుడ్డోడు తల్లిదండ్రులను వెంటేసుకుని బాబును కలిశాడు. ఈ సందర్భంగా ఆ బుడ్డోడికి చంద్రబాబుపై ఇంకా ఆశలు చావలేదన్న కోణంలో ఓ ఆసక్తికర కామెంట్ ను చేయించిన టీడీపీ..దానిని ఫేస్ బుక్ లో పెట్టేసి అడ్డంగా బుక్కై పోయింది. అయినా బాబును కలిసిన బుడ్డోడు భానుశేఖర్ ఏమన్నాడన్న విషయానికి వస్తే... తాను పెద్దయ్యేసరికి ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉండాలట. బాబే సీఎంగా ఉండాలట. అందుకోసం మీరేం చేస్తారో తనకు అనవసరం అని బాబుకు చెప్పాడట. ఈ మాటలు నాలుగేళ్ల బుడ్డోడి నోట నుంచి వచ్చాయని చెప్పిన టీడీపీ... ఆ మాటలకు ట్యాగ్ లైన్ గా ‘రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పసి మనసుపై అంతటి ప్రభావాన్ని చూపాయన్న మాట‘ అంటూ ఓ కామెంట్ ను జత చేసింది.
ఈ పోస్ట్ టీడీపీ అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ అయిన వెంటనే వైరల్ గా మారిపోయింది. అయినా నాలుగేళ్ల బాలుడికి చంద్రబాబు పాలన గురించి - ఏపీ నెంబర్ వన్ స్థానం గురించి ఎలా తెలిశాయబ్బా అంటూ ఇప్పుడు దానిపై సెటైర్లు - పవర్ ఫుల్ పంచ్ లు పడుతున్నాయి. తమ గొప్పలను చిలువలు పలువలు చేసుకునే టీడీపీ... చివరికి అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడితోనూ నాటకాలేయిస్తోందే అంటూ ట్రోలింగ్ లు మొదలైపోయాయి. టీడీపీ అవలంబిస్తున్న ఈ తరహా వైఖరికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అంటూ కామెంట్లు పోటెత్తుతున్నాయి. మొత్తంగా తమ గొప్పలు చెప్పుకునేందుకు ఓ నాలుగేళ్ల బాలుడితో తమదైన శైలి కామెంట్లు చేసిన టీడీపీ... అడ్డంగా బుక్కైపోయిందన్న వాదన వినిపిస్తోంది.