Begin typing your search above and press return to search.
తమ్ముళ్ల ఆవేదన వినిపిస్తోందా బాబు?
By: Tupaki Desk | 18 Nov 2016 7:30 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం శ్రమించే వారకి ఇగుర్తింపు ఉంటుందని చంద్రబాబు చెప్తున్నప్పటికీ ఆచరణలో అలాంటి పరిస్థితి లేదంటున్నారు. పైగా కేసుల పాలు అవుతున్నామని విశ్లేషిస్తున్నారు. వారి ‘మేం ప్రతిపక్షంలో ఉన్నామా? అధికారంలో ఉన్నామా? న్యాయం కోసం బాధితుల పక్షాన నిలబడితే మాపైనే కేసులు పెడితే ఇక క్యాడర్ లో ఏమి ఆత్మస్థైర్యం ఉంటుంది? నేతలకే దిక్కులేకపోతే ఇక కార్యకర్తల సంగతేమిటి? ప్రభుత్వం మీద దృష్టి పెట్టి పార్టీని విస్మరిస్తున్నందుకు నాయకత్వం ఎన్నికల సమయంలో మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఒక విద్యార్ధినికి హాల్ టికెట్ ఇవ్వని కాలేజీ యాజమాన్యంపై పోరాడిన తెలుగు విద్యార్ధి నేతలపై కేసులు బనాయించడం, ఈ అన్యాయాన్ని వారు పార్టీ నాయకత్వ దృష్టికి తీసుకువెళ్లడం, పార్టీ దానిపై ఆరా తీయడం చకచకా జరిగిపోయాయి. తమ కార్యకర్తల పక్షాన అక్కడికి వెళ్లిన జిల్లా విద్యార్థి నేతలపై కూడా కేసులు పెట్టడం తెదేపా శ్రేణులను విస్మయపరిచింది. ఇది మీడియాలో ప్రముఖంగా రావడం, తమకు జరిగిన అన్యాయాన్ని వారంతా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు కలత వ్యక్తం చేస్తున్నారు.కార్యకర్తలకు పదవులివ్వకపోయినా ఫర్వాలేదని, కనీస గుర్తింపు గౌరవం కూడా ఇవ్వకుండా అధికారంలో ఉన్న పార్టీవారిపైనే కేసులు పెడితే, ఇక తాము ఎవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకత్వం - స్థానిక ఎమ్మెల్యేలు - ఎంపీలు మమ్మల్ని నెత్తినపెట్టుకుంటారని ఆశించాం. రెండున్నరేళ్లు మాకు పదవులివ్వలేదు. అన్నీ ఎమ్మెల్యేలు - ఇన్చార్జులే అనుభవిస్తున్నారు. వచ్చిన కాంట్రాక్టులు కూడా వాళ్లే చేసుకుంటున్నారు. కనీసం మా పార్టీ అధికారంలో ఉందన్న తృప్తయినా మిగిలిందనుకుంటే అది కూడా దక్కడం లేదు. మాపైనే కేసులు పెడితే ప్రజలు - కార్యకర్తల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయి? ఈరోజు నర్సరావుపేటలో జరిగిన సంఘటనను మీడియాలో చూశాం. ఇది ఒక్క ఆ నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అవమానకర పరిస్థితులున్నాయి. కార్యకర్త కోరుకునేది అధికారంలో భాగస్వామ్యం, గౌరవం. అది దక్కనప్పుడు పార్టీకి వాళ్లు ఎందుకు విధేయతగా ఉంటారు? ఎందుకు పనిచేస్తారు’ అని మీడియాతో వాపోతున్నారు.
పదేళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తలకు కనీస గుర్తింపు లేకుండా పోతుంటే, మూలిగేనక్కపై తాటిపండు చందంగా తమమీదే కేసులు బనాయించడం పార్టీ శ్రేణులకు ఆవేదన కలిగిస్తోంది. బాబు పార్టీని , క్షేత్రస్థాయిలో వారికి జరుగుతున్న అవమానాలు పట్టించుకోకుండా, ప్రభుత్వంపై దృష్టి పెడుతుండటం వల్ల అనేక నష్టాలు తలెత్తుతున్నాయంటున్నారు. పార్టీ, కార్యకర్తలు సంతృప్తితో ఉంటేనే మళ్లీ ప్రభుత్వం వస్తుందని, ఈ విషయంలో బాబు మళ్లీ 2004కు ముందు బాటలోనే పయనిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కార్యకర్త బాగుపడ్డాడని, కానీ తాము అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆర్ధికంగా, శారీరకంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను గౌరవించాలని గతంలో వైఎస్ బాహాటంగానే అధికారులను ఆదేశించేవారని, అలాంటి మాట తమ నాయకత్వం నుంచి ఇప్పటివరకూ రాకపోవడం బాధాకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/