Begin typing your search above and press return to search.

వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే ఇలాకాలో టీడీపీకి క్యాండెట్ క‌రువు ?

By:  Tupaki Desk   |   30 Aug 2021 11:30 PM GMT
వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యే ఇలాకాలో టీడీపీకి క్యాండెట్ క‌రువు ?
X
రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తారు? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. గ‌తంలో టీడీపీ త‌ర‌పున క‌ల‌మ‌ట మోహ‌న్‌రావు.. ఐదు సార్లు విజ‌యం ద‌క్కించుకుని.. పార్టీని బ‌లోపేతం చేశారు. అయితే.. కాంగ్రెస్ హ‌వా కూడా ఎక్కువ‌గా ఉన్న ఈ నియ‌జ‌క‌వ‌ర్గంలో టీడీపీ రంగ ప్ర‌వేశం త‌ర్వాత‌.. కాంగ్రెస్ చ‌తికిల‌ప‌డింది. ఈ ఓటు బ్యాంకు దాదాపుగా టీడీపీ ప‌ర‌మైంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంది.

గ‌తంలో ఇక్క‌డ నుంచి ఓ సారి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి కూడా విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. గ‌డిచిన మూడు ఎన్నిక‌లుగా.. ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందుల్లోకి జారుకుంది. 2009లో కాంగ్రెస్ హ‌వా నేప‌థ్యంలో ఆ పార్టీ త‌ర‌ఫున శతృచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో టీడీపీ వ‌రుస విజ‌యాలకు బ్రేక్ ప‌డింది. ఆతర్వాత 2014లో వైసీపీ అరంగేట్రంతో టీడీపీ మ‌రింత‌గా ఇబ్బందులు ప‌డుతోంది. ఆ ఎన్నిక‌ల్లో క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ మూర్తి వైసీపీ జెండాపై విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఆయ‌న టీడీపీలోకి చేరిపోయారు.

చంద్ర‌బాబు పిలుపుతో.. టీడీపీ పంచ‌న చేరిన క‌ల‌మ‌ట‌.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో అదే పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే.. జ‌గ‌న్ సునామీ కార‌ణంగా.. క‌ల‌మ‌ట ఓడిపోయారు. ఇదిలావుంటే.. ఇప్పుడు క‌ల‌మ‌ట పార్టీలో లేర‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అదే స‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌నతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవ‌డంతో.. శ‌తృచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు.. పార్టీ మారి.. టీడీపీ జెండా భుజాన వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాత‌ప‌ట్నం టికెట్ కోరుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

పోనీ.. త‌న‌కు ఇవ్వ‌క‌పోయినా.. త‌న వారికి ఇవ్వాలంటూ.. చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న రెడ్డి శాంతి దూకుడు ముందు టీడీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రెడ్డి శాంతి ఆర్థికంగా కూడా బ‌లంగా ఉన్నారు. టీడీపీలో సాధార‌ణ అభ్య‌ర్థిని అక్క‌డ పోటీ పెట్టినా ప‌న‌వ్వ‌ద‌నే అంటున్నారు.

ఇంకోప‌క్క గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్ర‌భావం నుంచి పార్టీ ఇంకా కోలుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిని ఇక్క‌డ నిల‌బెట్టాలి? ఎలా ప‌ట్టు సాధించాలి? అనే అంశాల‌పై.. టీడీపీ మ‌ద‌న ప‌డుతోంది. మ‌రి చంద్ర‌బాబు ఇక్క‌డ ఎవ‌రిని సెట్ చేస్తారో ? చూడాలి.