Begin typing your search above and press return to search.
ఈ అభ్యర్థి దీన స్థితికి కన్నీళ్లు కారుస్తున్నారు..
By: Tupaki Desk | 8 April 2019 7:26 AM GMTఈ ఒక్క ఫొటో చూసి ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలంతా అయ్యో పాపం అంటున్నారు.. కొందరు మహిళలు కన్నీరు కారుస్తున్నారు.ఎన్నికల వేళ.. ఈ టీడీపీ అభ్యర్థికి వచ్చిన కష్టం చూసి బాధపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు..
కర్నూలు అంటేనే ముఠాకక్ష్యలు, రాజకీయాల్లో ఫ్యాక్షన్ సహజం.. అలాంటిది ఈ ఎన్నికల వేళ హింస ఇంకా పెచ్చరిల్లింది. కర్నూలు జిల్లాలో పార్టీ అభ్యర్థులు యుద్ధానికి దిగినట్టే ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇలానే మంత్రాలయం టికెట్ పొందిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి నెలకింద ఖగ్గల్లు గ్రామానికి ప్రచారానికి వెళ్లాడు. కానీ ఆ గ్రామం వైసీపీకి పెట్టని కోట.. దీంతో తిక్కారెడ్డిని వైసీపీ నేతలు అడ్డుకొని ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఆయనకు సెక్యూరిటీగా వెళ్లిన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరపడం.. ఒక బుల్లెట్ తప్పిపోయి తిక్కారెడ్డి కాలిలోకి దూసుకెళ్లడం తెలిసిందే. అలా నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్న తిక్కారెడ్డి స్ట్రెచ్చర్ పైనే వచ్చి మొన్న నామినేషన్ వేసి వెళ్లారు.
ఇప్పుడు ఎన్నికలకు ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే సమయం ఉంది. గెలవాలంటే ప్రచారం చేయాలి.. తిక్కారెడ్డి ఏమో కాలు బయటపెట్టవద్దని వైద్యులు ఆస్పత్రిలోనే ఉంచారు. ఏం చేయాలని బాగా ఆలోచించిన తిక్కారెడ్డి ఎట్టకేలకు 45 డిగ్రీల ఎండలో సాహసం చేయడానికి రెడీ అయ్యారు.
మండే ఎండలో కాలు కదపలేని స్థితిలో గాయ వేధిస్తున్నా పట్టించుకోకుండా స్ట్రెచర్ పై తిక్కారెడ్డి ఈరోజు తన మంత్రాలయం నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చాడు. స్టెచర్ పై పడుకొనే ప్రచారం చేస్తున్నాడు. తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ పక్కనే ఉండి సాయం చేస్తోంది. వీరిద్దరి ప్రచారం చూసి మహిళలు, ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు ఓటు వేయాలని కొంగుచాటి అడుగుతున్న వెంకటేశ్వరమ్మ , స్టెచర్ పై తిక్కారెడ్డి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ సానుభూతి చూపిస్తున్నారు. వీరి దీనస్థితికి కరిగి సెంటిమెంట్ గా మారి ఈసారి వీరికి భారీగానే ఓట్లు పడుతాయని చెబుతున్నారు.