Begin typing your search above and press return to search.
టీడీపీ రెడీ: 15లోపు 125 మందితో లిస్టు విడుదల..
By: Tupaki Desk | 10 March 2019 6:21 AM GMTదాదాపు ఈనెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఇప్పటికే వ్యూహాలు రచించారు. కొన్ని చోట్ల అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చిన పార్టీ అధినేతలు మరికొన్ని స్థానాలకు ఎవరిని బరిలోకి దించాలనే దానిపై ఆలోచనలో ఉన్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ మొత్తంగా అభ్యర్థుల లిస్టును తయారు చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అధికార టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ రెడీ అయిందట. దాదాపు 125 మందితో కూడిన ఈ జాబితా ఎప్పుడైనా పార్టీ అధినేత విడుదల చేయనున్నారట. ఇంతకీ ఆ లిస్టులో ఉన్నదెవరు..? ఎవరు ఆ ఛాన్స్ కొట్టబోతున్నారు..? అని టీడీపీ శ్రేణల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్తవారికి అవకాశం ఇచ్చారా..? పాతవారినే బరిలోకి దింపనున్నారా..?
ఏపీలో రాజకీయ యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. డేటా చోరీ వివాదం పెద్ద ఎత్తున్న దుమారం లేపుతోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నా ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు టీడీపీ అధినేత. తన ఎన్నికల టీంను ఫైనలైజ్ చేయడానికి పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేందుకు సిద్ధం చేస్తున్నారు. బందరు, విజయవాడ స్థానాల నుంచి సమీక్షలు మొదలుపెట్టారు.
నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల బలం, బలహీనతల గురించి చర్చించారు. వారి బలాన్ని, బలహీనతలను సమీక్షలో వారి ముందే చెప్పారు. అభ్యర్థులు ఖరారైన స్థానాల్లో అసమ్మతి ఎదురుకాకుండా చూడాలని ముఖ్య నేతలను ఆదేశించారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్న స్థానాల్లో చంద్రబాబే స్వయంగా వారితో చర్చించారు.
ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం 125 సీట్లలో అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఈనెల 15 లోపు ఫస్ట్ లిస్టును విడుదల చేయాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన తరువాతే పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్లాలని బాబు డిసైడ్ అయ్యారట. ఈనెల 13 నుంచి 'ప్రజాదర్బార్' పేరుతో చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టనున్నట్లు రాజకీయంగా చర్చ సాగుతోంది. రోజూ ఒక రోడ్ షో, ఒక బహిరంగ సభ ఉండాలని బాబు ప్లాన్ వేస్తున్నారు.
ఇక రెండు రోజుల గ్యాప్ తో పెండింగ్ లో ఉన్న అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు బాబు. ఇలా అన్ని రకాలుగా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు.