Begin typing your search above and press return to search.
ఒక్క బటన్ నొక్కితే చాలు జగన్ అరెస్ట్... బాబు అల్టిమేట్ కౌంటర్
By: Tupaki Desk | 20 Sep 2022 4:36 PM GMTఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక ప్రజా సమస్యలు పక్కన పెడితే వాడిగా విమర్శలు మాత్రం సాగుతున్నాయి. అటూ ఇటూ సవాళ్ళు చేసుకుంటున్నారు. టీడీపీని చంద్రబాబుని టార్గెట్ చేస్తూ జగన్ అసెంబ్లీని వేదికగా మార్చుకున్నారు. మరి అన్నింటా ఆరితేరిన చంద్రబాబు ఊరుకుంటారా. ఆయన జనంలోనే ఉంటూ జగన్ కి గట్టిగా సవాళ్ళు విసురుతున్నారు.
కుప్పంలో గెలుస్తామని ఎగరడం కాదు, ముందు పులివెందుల వెళ్ళి చూసుకో జగన్ అని హెచ్చరిస్తున్నారు. ఈసారి జగన్ అక్కడ జనాలకు ఏమి చెప్పి గెలుస్తాడని కూడా నిలదీస్తున్నారు. కోడి కత్తి కేసు చెప్పి ఓట్లు అడుగుతారా లేక బాబాయ్ గొడ్డలి పోటు దారుణ హత్యను చెప్పి గెలిపించమంటారా అని బాబు భారీ సెటైర్లు వేశారు.
ఇక మీదట నీవు కాదు చెప్పాల్సింది మేము, టోటల్ గా 175కి 175 సీట్లు మావే. అందులో నీ పులివెందుల సీటు కూడా ఉంది అని జగన్ని రెట్టిస్తున్నారు బాబు. ఇక అంతటితో ఆయన ఊరుకోవడంలేదు. అధికారం ఉంది కదా అని పోలీసులు తన వద్ద ఉన్నారని టీడీపీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలోకి తోస్తున్నారని విమర్శించారు. కానీ జగన్ ఒక్కసారి వెనక్కు చూస్తుకుంటే ఆయన మీద ఉన్నన్ని కేసులు ఎవరికైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
సీబీఐ జగన్ మీద పదకొండు కేసులు పెట్టిందని, అదే సీబీఐ ఒక్క బటన్ నొక్కితే చాలు అని జగన్ పక్కన ఉండే పోలీసులే ఆయన్ని క్షణాలలో అరెస్ట్ చేస్తారు అని బాబు అల్టిమేట్ కౌంటర్ ఇచ్చారు. ఇది జగన్ బాగా గుర్తుంచుకోవాలని కూడా హితవు పలికారు. ఎపుడూ రోజులు ఒక్కలా ఉండవని ఆయన అంటున్నారు.
నా జీవితంలో నేను ఏ రోజూ జైలు గేట్ దాకా కూడా పోలేదంటూ జగన్ పదహారు నెలల జైలు జీవితాన్ని ఇండైరెక్ట్ గా బాబు గుర్తు చేస్తున్నారు. జగన్ ది ఫక్తు నేర చరిత్ర అని ఇక మీదట దాన్నే టీడీపీ పెద్ద ఎత్తున జనంలో పెట్టి ప్రచారం చేస్తుందని బాబు స్పష్టం చేస్తున్నారు.
పోలీసులు కూడా అధికార పార్టీకి వత్తాసు పలికితే రేపు విచారించాల్సిన పరిస్థితులు ఉంటాయని బాబు హెచ్చరించారు. వారిని తాము వదిలిపెట్టే సీన్ లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ విధ్వంస పాలనను తమ పార్టీ క్యాడర్ అడ్డుకుంటుందని, వారికి అండగా తాము ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తానికి జగన్ అరెస్ట్ అవుతారు అంటూ బాబు కొత్తగా ప్రకటించడంతో ఆయన మాటల వెనకాల ఉన్న రాజకీయ వ్యూహాలు ఏంటి అన్నదే చర్చగా ఉంది.
ఉన్నట్లుండి సీబీఐ బటన్ ఎందుకు నొక్కుతుంది, దానికి దారి తీసే పరిస్థితులు ఏమిటి అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో సాగుతోంది. ఈ మధ్యనే జగన్ ఆస్తుల కేసులు సీబీఐ కోర్టులో విచారణకు వస్తున్నాయి. మరి జగన్ బెయిల్ రద్దు చేయించే విషయం మీద ఏమైనా వ్యవహారం ముందుకు వస్తుందా లేక కేసులు తొందరగా ఎన్నికల ముందే విచారణ పూర్తి చేసుకుంటే జగన్ అరెస్ట్ కాక తప్పదన్న ధోరణిలో బాబు మాట్లాడారా అన్నదే చర్చగా ఉంది మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.