Begin typing your search above and press return to search.
అన్ని పార్టీల సభలు అక్కడే జరిగాయి కదా.... అంటున్న బాబు
By: Tupaki Desk | 29 Dec 2022 12:02 PM GMTనెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్‌షోలో జరిగిన దుర్ఘటన ఏపీలో రాజకీయ వివాదం సృస్టిస్తోంది. చంద్రబాబు కేవలం ప్రచార యావతోనే ఆ ఇరుకైన స్థలంలో సభ పెట్టారని, అందువల్లే తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తిప్పికొట్టారు. తానేమీ కొత్తగా ఈ రోజు సభ అక్కడ పెట్టలేదని, గతంలో కందుకూరులో ఇదే ప్రాంతంలో ఎన్నో పార్టీలు బహిరంగ సభలు నిర్వహించాయని అన్నారు. అందరూ సభలు పెట్టిన చోటే మేం కూడా సభలు పెట్టామని చెప్పారు.
కందుకూరులో టీడీపీ నిర్వహించిన రోడ్‌షోకు జనం బ్రహ్మరథం పట్టారు. అయితే దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగి 8 మంది టీడీపీ అభిమానులు ప్రాణాలు కోల్పవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితుల కుటుంబాలను చంద్రబాబు నాయుడ బుధవారం ఓదార్చారు.
పార్టీ తరఫున ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం టీడీపీ పార్టీ తరఫున అందేలా ఏర్పాట్లు చేశారు. బాధిత కుటుంబాలకు స్వయంగా చెక్కులు అందజేస్తారు. మరణించిన ప్రతి మృతుడి ఇళ్లకు ఆయన నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యలను ఓదార్చారు. ఈ కుటుంబాలకు తాను అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు.
మరోవైపు బాబు ఆ ప్రాంతంలో సభ నిర్వహించడంపై విపక్షాలు దమ్మెత్తి పోస్తున్నాయి. కందుకూరులో సందులాగా ఉండే ఈ ప్రాంతంలో కేవలం 5 వేల మంది వస్తే ఆ ప్రాంతం కిటకిటలాడిపోతుందని అలాంటి చోట చంద్రబాబు అంత బహిరంగ సభ ఎలా పెడతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనకున్న ప్రచార పిచ్చితో తక్కువగా జనం వచ్చినా ఎక్కువగా వచ్చినట్లు చపించడానికి డ్రోన్లతో చిత్రీకరించడానికి అక్కడ ఉద్దేశపూర్వకంగా సభ నిర్వహించారని, ఫలితంగా అంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
కందుకూరు సభలో తొక్కిలాటకు సంబంధించి తనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సమాధానమిచ్చారు. ఇరుకు రోడ్లలో సభలు జరపాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని, అన్ని పార్టీలు సభలు జరిపే చోటే తాము కూడా సభ ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని విషయాలను తమపై విమర్శలు చేసిన వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.