Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు `వ‌స్తున్నా.. మీకోసం` మ‌ళ్లీ రిపీట్‌...!

By:  Tupaki Desk   |   14 Jan 2023 10:30 AM GMT
చంద్ర‌బాబు `వ‌స్తున్నా.. మీకోసం` మ‌ళ్లీ రిపీట్‌...!
X
2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌స్తున్నా మీకోసం.. అంటూ చంద్ర‌బాబు ఏపీలో పాద‌యాత్ర‌, బ‌స్సు యాత్ర క‌లిపి చేసిన‌విష‌యం తెలిసిందే. కొంత దూరం పాద‌యాత్ర‌.. దానికి అవ‌కాశం లేన‌ప్పుడు బ‌స్సు యాత్ర ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. ఇది వ‌ర్క‌వుట్ అయింది. చంద్ర‌బాబును అధికారంలోకి తీసుకువ చ్చింది. దీనికి అనేక ఈక్వేష‌న్లు కూడా క‌లిసి వ‌చ్చాయి.

ఇక‌, ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి చంద్ర‌బాబు మ‌రోసారి వ‌స్తున్నా మీకోసం.. యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. అదేంటి.. ? ఇప్ప‌టికే నారా లోకేష్ పాద‌యాత్ర కు రెడీ అవుతున్నారు క‌దా! అనే చ‌ర్చ ఉంది. కానీ, నారా లోకేష్‌పాద‌యాత్ర‌ను వైసీపీ రాజ‌కీయం చేసి.. దీని తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని.. త‌ద్వారా ఇది.. యువ‌త‌కుమాత్ర‌మే చేరుతుంద‌ని.. ఫ‌లితంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. గ్రామీణుల సెంటిమెంటును రాజేయ‌డం.. ఇబ్బందేన‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు మ‌రోసారి త‌నే రంగంలోకి దిగి.. ప్ర‌జ‌ల్లో బాగా పాపులారిటీ సాధించిన వ‌స్తు న్నా మీకోసం.. నినాదాన్ని లైవ్‌లో ఉంచి.. యాత్ర చేప‌ట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే.. ఈసారి మాత్రం ఇది పూర్తిగా బ‌స్సుకే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. పాద‌యాత్ర కంటే కూడా బ‌స్సు యాత్ర ద్వారా.. ఎక్కువ‌ ప్రాంతాలుక‌వ‌ర్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌, అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగితే..వ‌చ్చే రెస్పాన్స్ భిన్నంగా ఉంటుంద‌ని.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు వెంట‌నే ఆక‌ర్షితులు అవుతార‌ని కూడా పార్టీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌స్తున్నా మీకోసం యాత్ర‌పై సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని.. పార్టీనేత‌ల‌తో గ‌త రెండు రోజులు చంద్ర‌బాబు ఇదే విష‌యంపై చ‌ర్చించార‌ని అత్యంత విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.