Begin typing your search above and press return to search.
ఉత్తరాంధ్రా సైకిలెక్కుతుందా....?
By: Tupaki Desk | 31 Dec 2022 11:30 PM GMTఉత్తరాంధ్రాలో ఇటీవల చంద్రబాబు జరిపిన పర్యటన సూపర్ సక్సెస్ అయింది. బాబు టూర్ లో లేని చోట్ల కూడా జనాలు బారులు తీరడంతో ఆయన ఆగి మరీ ప్రసంగించాల్సి వచ్చింది. అదే విధంగా బాబు రోడ్ షోలు ఎక్కడ ఉన్నా జనాలు పోటెత్తారు. బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం లలో జనాలు వెల్లువలా తరలివచ్చారు.
దాంతో చంద్రబాబులో ధైర్యం ఒక్కసారిగా పెరిగింది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని జనాల సాక్షిగా ప్రకటించేశారు. ఇక జగన్ కి పోలీసు అధికారులకు ఆయన వార్నింగులు ఇచ్చేశారు. నా రాజకీయ జీవితం అంత అనుభవం లేని జగన్ తో పోటీ పోలిక ఏంటి అన్నట్లుగా బాబు మాట్లాడారు.అలాగే జగన్ తండ్రి వైఎస్సార్ కూడా తన తరువాతనే సీఎం అయ్యరని గుర్తు చేశారు.
జగన్ అండ చూసుకుని పోలీసు అధికారులు కొందరు అతి చేస్తున్నారు కానీ వారి విషయంలో కూడా అన్నీ చూస్తామని బాబుస్ సీరియస్ గానే చెప్పేశారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు సభలకు వచ్చిన విపరీత స్పందన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకుల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అయితే జనాల స్పందన చూస్తే టీడీపీ పవర్ లోకి రావడం ఖాయమని చెప్పారు.
మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఈసారి ఉత్తరాంధ్రాలో ఉన్న 34 సీట్లకు మొత్తానికి మొత్తం గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం పెట్టే బేడా సర్దుకోవాల్సిందే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. ఇవన్నీ పక్కన పెట్టినా తటస్థంగా ఆలోచించినా కూడా ఉత్తరాంధ్రాలో గాలి మళ్ళింది అనే అంటున్నారు
ఒక విధంగా చూస్తే రాజకీయ మార్పుని జనాలు కోరుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. దీని మీద వైసీపీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఏకంగా బాహాటంగానే ఒక మాట అనేశారు. ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజానీకానికి సైకిల్ మోజు ఇంకా పోనట్లుగా ఉందని అయితే బాబు మాయమాటలు చెప్పి అందలం ఎక్కుతారని, ఆయన తరువాత చేసేది ఏమీ ఉండదని ధర్మాన కామెంట్స్ చేశారు.
ఈ సీనియర్ మంత్రి ఎన్నో ఎన్నికలను చూసిన పెద్ద మనిషి మాటలనే తీసుకున్నా సైకిల్ మోజు లో ఉత్తరాంధ్రా జనాలు ఉన్నారా అన్న డౌట్ రాకమానదు, నిజానికి ఎపుడూ ఉత్తరాంధ్రా జిల్లాలు సైకిల్ పార్టీకే మద్దతుగా ఉంటాయి. 2019లో ఫస్ట్ టైం వైసీపీ వైపు కొమ్ము కాశాయి. మళ్లీ 2024లో మాత్రం తెలుగుదేశం పక్షమే ఈ ప్రాంతాలు వహిస్తాయని పసుపు పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూంటే వైసీపీ పెద్దలకు కూడా డౌట్ ఎక్కడో కొడుతోంది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఉత్తరాంధ్రా టర్న్ అయితే ఏపీలో అధికార మార్పిడి ఖాయమన్న సెంటిమెంట్ ని కూడా ఈ సందర్భంగా తలపండిన రాజకీయ పెద్దలు గుర్తు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.