Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల మార్పు
By: Tupaki Desk | 19 March 2019 5:17 AM GMTప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తున్నట్టే జరుగుతోంది. తెరవెనుక లాలూచీ వ్యవహారాలు సీట్ల కేటాయింపు వేళ బయటపడుతున్నాయి. ఇప్పుడు జనసేన-టీడీపీ తెరవెనుక దోస్తీ ప్రత్యక్ష ఎన్నికల్లో కళ్లకు కడుతోంది. జనసేన పార్టీ ప్రధాన అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు మార్చేస్తుండడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఒంటరి పోటీ అన్న పవన్ కళ్యాన్ మాటలు వట్టి నీటి మూటలని దీని ద్వారా తేటతెల్లమవుతుందని ప్రతిపక్షాలు ఉదాహరణలతో సహా నిరూపిస్తున్నాయి..
తాజాగా జనసేన కోసం టీడీపీ సీట్లలో భారీ మార్పులు చేస్తోంది. స్వయంగా చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మారుస్తున్నారు. నరసాపురం ఎంపీ బరిలో జనసేన నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీచేయబోతున్నాడని తెలిసి.. అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న బలమైన అభ్యర్థి చైతన్యరాజు ను చంద్రబాబు తప్పించడం రాజకీయంగా సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట చైతన్యరాజుకి ఎంపీ సీటు హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు ఆ స్థానంలో డమ్మీ క్యాండిడేట్ అయిన ఉండి ఎమ్మెల్యే శివను పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇష్టంలేకపోయినా బలవంతంగా శివను ఎంపీకి పంపుతున్నట్టు తెలిసింది. నాగబాబు వస్తున్నారని తప్పుకోవాలని చైతన్యరాజుకి బాబు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక గుంటూరులోనూ జనసేన తెరవెనుక పొత్తులతో సీట్ల సర్దుబాటుకు ప్రయత్నించాయి. కానీ అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ రాయపాటి వార్నింగ్ తో గుంటూరు లో టీడీపీ, జనసేన టికెట్ల సర్దుబాటు కి బ్రేక్ పడినట్లు సమాచారం. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పోలవరం లో అవినీతి చిట్టా బయటపెడతానని సీఎం కు రాయపాటి అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాయపాటి వార్నింగ్ తో దిగొచ్చిన బాబు ఆలపాటి, భాష్యం రామకృష్ణ ల ప్రతిపాదనలు విరమించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక జనసేనలో పవన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి అభ్యర్థిని మార్చా లని చంద్రబాబు యత్నించారని తెలిసింది. తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజా సీటు మార్చి ఎంపీకి వెళ్లాలని బాబు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ ఆలపాటి, రాయపాటి ఎదురు తిరగడం తో ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడ్డట్టు వార్తలొస్తున్నాయి.
గుంటూరులో జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ కోసం టీడీపీ అభ్యర్థి మార్పు కు బాబు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. మద్దాల గిరికి తొలుత హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మద్దాల గిరిని నరసరావుపేట వెళ్లాలని ఒత్తిడి చేశారట.. కానీ మద్దాల గిరి అంగీకరించకపోవడం తో టీడీపీ లో సందిగ్థత ఏర్పడింది.
లోకేష్ సీటుని సీపీఐ కి ఇచ్చి సహకరించిన పవన్ కళ్యాణ్ కు బాబు ఇలా అడిగిన చోట అభ్యర్థిని మార్చేస్తూ సహకరిస్తున్నారట.. లోకేష్ పై పోటీకి మంగళగిరి నుంచి జనసేన దూరం కావడంతో ఇవే అనుమానాలకు కారణమవుతోంది. ఇక టీడీపీ ఫైర్ బ్రాండ్ బొండా ఉమా సీటుని కూడా సీపీఎం కు కేటాయించి పవన్ సహకరించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
పవన్ కోటాలో గత ఎన్నికల్లో టీడీపీ సీటు తెచ్చుకున్నారట బొండా. అందుకే ఇప్పుడు బొండా ఉమాపై పోటీకి జనసేన దూరం పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా సీట్ల ప్రకటన వేళ.. జనసేన, టీడీపీలు తమ తమ కీలక నేతలపై డమ్మీ అభ్యర్థులను పెడుతూ ఒకరినొకరు సహకరించుకుంటున్నారని తేటతెల్లమవుతోంది.. ఇరు పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల మార్పులు, చేర్పులను బట్టి ఇదే అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. డమ్మీ అభ్యర్థులతో జనసేన, టీడీపీ మధ్య రహస్య పొత్తు పొడిచిందని కుండబద్దలు కొడుతున్నారు.