Begin typing your search above and press return to search.

టీఢీపీ : ఉత్త‌రాంధ్ర రివ్యూలో తేలేదెంత ? మునిగేదెంత ?

By:  Tupaki Desk   |   16 Jun 2022 8:30 AM GMT
టీఢీపీ : ఉత్త‌రాంధ్ర రివ్యూలో తేలేదెంత ? మునిగేదెంత ?
X
ఇవాళ (గురువారం, జూన్ 16, 2022 ) కూడా ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. అన‌కాప‌ల్లిలో నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్-ల‌తో స‌మావేశ‌మై, పార్టీ పొజిష‌న్ పై వివ‌రాలు రాబ‌ట్ట‌నున్నారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే వివిధ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌లు స‌బ్జెక్ట్ ప్రిప‌రేష‌న్లో ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర అంటే అటు టీడీపీకి ఇటు వైసీపీకి హిట్ సెంటిమెంట్.

కానీ గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ఫ‌లితాలు అందుకోలేక‌పోయింది. విజ‌య‌న‌గ‌రంలో ఒక్క‌టంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక‌పోయింది. శ్రీ‌కాకుళంలో రెండు మిన‌హా మిగ‌తా స్థానాల‌న్నింటినీ వైసీపీనే త‌న ఖాతాలో వేసుకుంది. క‌డ‌ప మాదిరిగా ఇక్క‌డ ఫ‌లితాలు ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేసేసింది వైసీపీ. అటుపై విశాఖ‌లో నాలుగంటే నాలుగు స్థానాల‌నే గెలుచుకుంది. ఇందులో విశాఖ ఉత్త‌ర, ద‌క్షిణ, తూర్పు, ప‌డ‌మర స్థానాలే ఉన్నాయి. ఇవ‌న్నీ టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే మిగిలిన స్థానాల‌ను ముఖ్యంగా ప‌ట్టున్న స్థానాల‌ను టీడీపీ గెలుచుకోలేక‌పోయింది. గాజువాక లాంటి కీల‌క స్థానాన్ని కోల్పోయింది.

ముఖ్యంగా విశాఖ కేంద్రంగా టీడీపీ చేయాల్సిన ప్ర‌జాహిత ప‌నులు బోలెడు ఉన్నాయి. ఏపీలో డ్ర‌గ్ రాకెట్, సెక్స్ రాకెట్ కు సంబంధించి అనేక ఆధారాలు విశాఖ కేంద్రంగా ఏయూ కేంద్రంగా ఉన్నాయి అన్న వార్త‌లు ఉన్నాయి. వీటిపై అస్స‌లు మాట్లాడిన దాఖ‌లాలే లేవు. ఒక‌ప్పుడు చ‌దువుల నిల‌యం ఆంధ్రా యూనివ‌ర్శిటీ ఇప్పుడు రాజ‌కీయాల‌కు ఆన‌వాలుగా ఉంది అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.వీటిపై టీడీపీ ప్ర‌జా పోరు చేస్తే ఫ‌లితాలు వ‌స్తాయి. విశాఖ‌కు సంబంధించి నిన్న‌టి వేళ సాయిరెడ్డిపై కొన్ని కామెంట్లు చంద్ర‌బాబు చేశారు. వీటిని సీరియ‌స్ గా తీసుకుని రుషి కొండ త‌వ్వ‌కాల‌పై మ‌రింత పోరాటం చేయాల్సి ఉంది. ఇక్క‌డ ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ అన్న‌ది లేదు. కేవ‌లం బూతులు మాత్రం తిడుతున్నారు అని అయ్య‌న్న‌లాంటి వారి గురించి వినిపిస్తున్న విమ‌ర్శ.

ఇక విశాఖ కు ఆయువు ప‌ట్టులాంటి స్టీల్ ప్లాంట్ ఉద్య‌మాల‌పై కూడా ప‌సుపు పార్టీ పెద్ద‌గా మాట్లాడిన దాఖ‌లాలు లేవు అన్న విమ‌ర్శ కూడా ఉంది. టీడీపీ వ‌ర‌కూ శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మాత్రంలోక్ స‌భ‌లో సైతం గ‌ళం వినిపించారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ స‌మితితో క‌లిసి ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు సైతం దిగారు. ఇవి అప్ప‌ట్లో పార్టీ మైలేజ్ ను పెంచాయి. కానీ త‌రువాత స్థానిక నేత‌లు వీటిపై మాట్లాడిన దాఖ‌లాలు లేవు అన్న విమ‌ర్శ ఉంది. అందుకే విశాఖ‌లో వైసీపీ అంత ధీమాగా ఉంద‌న్న వాద‌న ఉంది.

ఎమ్మెల్యే సీట్లే కాదు మూడు ఎంపీ సీట్లు కూడా ఇక్క‌డే ఉన్నాయి. ఉమ్మ‌డి విశాఖ‌కు సంబంధించి విశాఖ, అన‌కాప‌ల్లి, అర‌కు ఈ మూడింటిపై టీడీపీ అధినేత ఫోక‌స్ పెట్టాల్సి ఉంది. ఈ సారి ఎలా అయినా విశాఖ ఎంపీ స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని వైసీపీ చూస్తోంది. సాయిరెడ్డి అంత పంతంలో ఉన్నారు అని తెలుస్తోంది. ఇదే స‌మయంలో సాయిరెడ్డికి దీటుగా బీజేపీ నేత పురంధేశ్వ‌రి కూడా ఆశ ప‌డుతున్నా ఈ సీటుపై ! ఇక టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి గాజువాక కు చెందిన ఓ లీడ‌ర్ ను ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేయించే ఉద్దేశం ఉంది. కానీ ఆయ‌న నెగ్గుకువ‌స్తారా అన్న‌ది ఓ డౌట్.

నిన్న‌టి వ‌ర‌కూ గంటా శ్రీ‌నివాస‌రావుతో టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డి ఎంపీ స్థానానికి నామినేష‌న్ వేయించాల‌ని భావించార‌ని వార్త‌లు కూడా ఉన్నాయి. ఇక గిరిజ‌న తండాల్లో గంజాయి సాగు నియంత్ర‌ణలో లేద‌న్న వార్త‌లున్నాయి. వీటిపై కూడా టీడీపీ పోరాటం చేస్తే మంచి ఫలితాలు వ‌స్తాయి. ఇక ఉత్త‌రాంధ్ర‌లో శ్రీ‌కాకుళంలో పార్టీ కాస్త బెట‌ర్-గానే ఉంది. విజ‌య‌న‌గ‌రంలో బొత్స‌కు కొంత అస‌మ్మ‌తి పోరు ఇంటి నుంచే ఉంది అని తెలుస్తోంది. దీనిని త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకోగ‌లిగితే టీడీపీదే విజ‌యం.