Begin typing your search above and press return to search.

బాబు ఎఫెక్ట్ ఉత్త‌రాంధ్ర‌పై ఎంతంటే ?

By:  Tupaki Desk   |   19 Jun 2022 2:30 AM GMT
బాబు ఎఫెక్ట్ ఉత్త‌రాంధ్ర‌పై ఎంతంటే ?
X
3 రోజుల ప‌ర్య‌ట‌న త‌రువాత చోడ‌వరం నుంచి చీపురుప‌ల్లి వ‌ర‌కూ బాబు త‌న‌దైన ప‌ర్య‌ట‌న సాగించాక ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌పై ఆయ‌న ప్ర‌భావం ఏ మేర‌కు ఉండ‌నుందో అన్న ఆస‌క్తి ఒక‌టి నెల‌కొని ఉంది.

కొంద‌రు తెలుగు దేశం అభిమానులు ప్ర‌తిస్పందిస్తూ... ఆయ‌న ప‌ర్య‌ట‌న కార‌ణంగా పార్టీ బాగు ప‌డింద‌ని, మరింత మెరుగైన ఫ‌లితాలు అందుకోనుంద‌ని అంటున్నారు.

శ్రీ‌కాకుళం వ‌ర‌కూ ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్ర‌భావం ఉంటుంద‌ని కూడా అంటున్నారు. రానున్న కాలంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఒక్క‌రే ఉమ్మ‌డి శ్రీ‌కాకుళంలో గెలుస్తార‌ని, ఆయ‌న‌తో పాటు మ‌రో స్థానం వైసీపీ ఖాతాలో ఉంటుంద‌ని అంటున్నారు.

ప‌ది నియోజ‌క‌వ‌ర్గాలున్న శ్రీ‌కాకుళంలో ధ‌ర్మాన దాస‌న్న (పూర్తి పేరు ధ‌ర్మాన కృష్ణ‌దాసు, న‌ర‌స‌న్న‌పేట ఎమ్మెల్యే) ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు టీడీపీ అభిమానులు. అదేవిధంగా పాత‌ప‌ట్నం, రాజాం, ఎచ్చెర్ల వంటి కాపు క‌మ్యూనిటీ ప్ర‌భావం ఉన్న స్థానాలు కూడా ఈసారి టీడీపీ ఖాతాల‌కే చేరుతాయి అని తెలుస్తోంది.

ఇక మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలు అయిన టెక్క‌లి, ఇచ్ఛాపురంలలో టీడీపీకి లోటు లేద‌ని, అదేవిధంగా విజ‌య‌న‌గ‌రంలోనూ పార్టీకి తిరుగులేద‌ని అంటున్నారు ఓ వ‌ర్గం నేత‌లు.

వ‌ర్గ పోరు మ‌రిచి ప‌నిచేస్తే విశాఖ‌లో కూడా మంచి ఫ‌లితాలే వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, ఐదు ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో విశాఖనే అత్యంత కీల‌కం. ఆయ‌న దృష్టి కూడా విశాఖ‌పైనే ఉంచారు. స్టేట్ క్యాపిటల్ గా విశాఖ‌ను చేయాల‌న్న త‌లంపులో జ‌గ‌న్ ఉన్నారు క‌నుక చంద్ర‌బాబు కూడా త‌రుచూ సంబంధిత పెద్ద‌ల‌తో మాట్లాడుతూ ఉన్నారు.