Begin typing your search above and press return to search.

నేల మీద చంద్రుడు...వారెవ్వా మారావ్ కదయ్యా....

By:  Tupaki Desk   |   6 May 2022 6:24 AM GMT
నేల మీద చంద్రుడు...వారెవ్వా మారావ్ కదయ్యా....
X
నింగిన ఉన్న చంద్రుడు నేల మీదకు దిగి వచ్చాడు. అంతే కాదు బీదలు, పేదలతో కలసిపోయాడు. వారితోనే ఉంటూ వారి మాట వింటూ వారి తిండి తింటూ చంద్రబాబు వారి మనిషి అయిపోయాడు. రోడ్డు పక్కన ఒక మామూలు టీ కొట్టు దగ్గర తేనీరు సేవిస్తూ చంద్రబాబు అక్కడ జనాలతో పిచ్చాపాటీ మాట్లాడడం ఎపుడైనా చూశారా. అది భీమిలీ టూర్ లో జరిగింది.

ఏ నలుగురు కనిపించినా ఎలా ఉన్నావయ్యా అంటూ భుజం మీద చేయి వేసి అప్యాయంగా పలకరింపు. వారి సమస్యలను పూర్తిగా శ్రద్ధగా విని ఓదార్చడం, కంగారు పడవద్దు, కలవరపడవద్దు, నేనున్నా అంటూ భరోసా. ఇదంతా చంద్రబాబులో కనిపిస్తున్న తాజా మార్పు.

అంతే కాదు నా పేదలు, నా రైతులు, నా బీదలు, నా బడుగులు అని కూడా బాబు వారిని ఓన్ చేసుకుంటూ తన స్పీచ్ లో పదే పదే చెబుతున్నారు. అన్ని వర్గాలకు వైసీపీ అన్యాయం చేసింది అని అంటున్నారు. ఇక పేదవారికి తాను అండగా ఉంటానని చెబుతున్నారు.

ఇక ఈ మూడేళ్ళలో పాలన ఎలా ఉందయ్యా, మీ కుటుంబానికి ఏమైనా మేలు జరిగిందా అని ఒక సర్వే మాదిరిగా బాబు వాకబు చేయడం విశేషం. అంతే కాదు, చిన్న పిల్లలను కూడా దగ్గరకు తీసుకుని వారి నుంచి కూడా జవాబులు రాబడుతున్నారు. ఈసారి టూర్ లో కొట్టొచ్చిన మార్పు ఏంటి అంటే బాబు బీసీలు ఎస్సీల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు.

ఇక విశాఖలో బీసీ అయిన టీడీపీ ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు ఇంటికి బాబు వెళ్ళి దాదాపుగా ముప్పావు గంట పాటు అక్కడ గడపడం. తమ ఇంటికి చంద్రబాబు రావడంతో దువ్వారపు కుటుంబం మొత్తం ఉబ్బి తబ్బిబ్బు అయింది. ఈ మధ్యనే ఆయన సతీమణి చనిపోయింది.

దాంతో ఆమెకి నివాళి అర్పిస్తూ మొత్తం ఫ్యామిలీతో బాబు గడిపారు. అలాగే ఆ చుట్టుపక్కన కుటుంబాలని కూడా ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి చూస్తే చంద్రయ్యా మారావ్ కదయ్యా అని అంతా అనుకునేలా బాబు లేటెస్ట్ తీరు అయితే ఉంది.