Begin typing your search above and press return to search.
మళ్లీ సెల్ఫ్ గోల... బాబు మారడబ్బా
By: Tupaki Desk | 28 Aug 2019 6:15 PM GMTటీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనను తాను ఆకాశానికి ఎత్తేసుకోవడంలో బాగానే ముదిరిపోయారు. దాదాపుగా పదిహేనేళ్ల పాటు సీఎంగా, మరో పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగి... మరో ఐదేళ్ల పాటు విపక్ష నేతగా కొనసాగేందుకు అర్హత సాధించిన చంద్రబాబు... సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో తనను మించిన వారే లేరన్న వాదన వినిపిస్తోంది. సీఎంగా ఉన్నా, విపక్ష నేతగా ఉన్నా... తాను సాగించిన పాలనను పదే పదే వల్లె వేస్తూ సాగుతున్న చంద్రబాబు.. ఇతర పార్టీల నేతలు, ప్రజలతో పాటు స్వపక్షంలోనే నేతలకు కూడా చిరాకు పుట్టించిన వైనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే... ఏదో సందర్భం వచ్చింది కదా అని ఓ సారి వింటే... పదే పదే తనకు తానే సమయాన్ని, సందర్భాన్ని సృష్టించుకుని మరీ చంద్రబాబు సెల్ఫ్ డబ్బాను వినిపిస్తున్నారు.
తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో జరిపిన సమీక్ష సందర్భంగానూ చంద్రబాబు తన పాత పాటను మళ్లీ వినిపించారు. మొన్న హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతి పెద్దదైన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ భారీ అమెజాన్ కేంద్రం కూడా తన వల్లే హైదరాబాద్ కు వచ్చిందంటూ బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. అయినా బాబు ఈ దిశగా ఏమన్నారన్న విషయానికి వస్తే... హైదరాబాద్ లో గతంలో తాను చేసిన కార్యక్రమాల వల్లే ఇప్పుడు అమెజాన్ తన భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
భావి తరాలను దృష్టిలో పెట్టుకునే తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని తనదైన పాత డైలాగ్ ను వల్లె వేసిన చంద్రబాబు... అదే మాటను ఇప్పుడు నవ్యాంధ్ర నూతన రాజధానికి విస్తరించేశారు. గతంలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా భావి తరలాను దృష్టిలో పెట్టుకునే అమరావతిని అభివృద్ధి చేశానంటూ చంద్రబాబు తన సెల్ఫ్ డబ్బాను కాస్తంత గట్టిగానే వాయించేశారు. తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉండటం చారిత్రక అవసరంగా మారిందని కూడా చంద్రబాబు మరో భారీ డైలాగ్ ను వదిలారు.ఇక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఖమ్మంలో అభివృద్ధి జరిగిందని, ఆ తర్వాత ఖమ్మంలో అభివృద్ధి అన్న మాటే కనబడలేదని కూడా చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని చంద్రబాబు... తాజాగా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ గా నిలిచిన పీవీ సింధూ ప్రస్తావనను కూడా తీసుకువచ్చిన చంద్రబాబు... గచ్చిబౌలిలో పుల్లెల గోపీచంద్ అకాడమీకి తాను స్థలం కేటాయించడంతోనే ఇప్పుడు సింధూ విజయం సాధించిందంటూ మరో భారీ డైలాగ్ వదిలారు. సరే చంద్రబాబు చెప్పే ఈ సెల్ఫ్ డబ్బా కొత్తదేమీ కాదు కదా... అందుకేనేమో... ఖమ్మం జిల్లా తెలుగు తమ్ముళ్లు కూడా బాబు చెబుతున్నంత సేపు అలా వింటూ ఉండిపోయారట. బాబు ప్రసంగం పూర్తి అయిన తర్వాత సెల్ప్ గోల వినిపించుకునే లక్షణాన్ని చంద్రబాబు వదలరు కదా... అసలు బాబు మారితే కదా ఈ డబ్బా వినే దౌర్భాగ్యం తప్పేదంటూ తమ్ముళ్లు గుసగుసలాడుకున్నారట.