Begin typing your search above and press return to search.
నేను మారుతున్నా... ఎన్నోసారి సారూ...?
By: Tupaki Desk | 3 Sep 2022 11:30 AM GMTమారుతున్నా అంటున్నపుడల్లా ఇంకా ఇప్పటిదాకా మారలేదన్న సౌండ్ కూడా ఇండైరెక్ట్ గా వస్తోంది. చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఏ విషయంలో అయినా మాట్లాడితే అది క్యాడర్ సహా జనాలు కూడా నమ్ముతారు. అలాంటికి పదే పదే చంద్రబాబు తాను మారుతున్నా అని అంటున్నారు. ఆయన నిజానికి 2014 ఎన్నికల ముందు ఇదే మాట అన్నారు. మరి నాడే మారితే ఇపుడు కొత్తగా మారాల్సిన అవసరం ఏముంది.
ఆనాడు బాబు తాను పార్టీని నిర్లక్ష్యం చేశాను అని చెప్పుకున్నారు. ప్రభుత్వం మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి పార్టీని పక్కన పెట్టేయడం వల్లనే ఇబ్బంది వచ్చింది అని గుర్తించినట్లుగా కూదా చెప్పుకున్నారు. ఇది మంచి విశ్లేషణే. సరైన విషయాన్నే ఆయన పట్టుకున్నారు. కానీ 2014లో బాబు సీఎం అయిన తరువాత మాత్రం చుట్టూ కోటరీ అలాగే ఉంది. అలాగే అధికారంలో ఉన్నపుడు చాలామంది పక్కన చేరిపోయారు.
పార్టీలో ఏం జరుగుతుందో కూదా అసలు తెలియనిచ్చే పరిస్థితి లేదు. అంతా బాగుంది అన్న ఆలోచనలతోనే 2019 ఎన్నికలను ఫేస్ చేశారు. ఫలితాలు తేడా కొట్టాయి. ఆ తరువాత నుంచి చంద్రబాబు మళ్ళీ తాను మారాను అంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాను, క్యాడర్ కే ముందు ప్రాధాన్యత అంటున్నారు. కానీ ఆచరణలో ఇది సాధ్యమేనా అన్న చర్చ అయితే మళ్లీ వస్తోంది.
తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు తాను మారుతున్నాను మీరూ మారాలి అని క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. దాంతో బాబు గారే ఇంకా మారలేదు అన్న మెసేజ్ ఇండైరెక్ట్ గా వెళ్ళిపోతోంది అని అంటున్నారు. మారిన బాబు అయితే ఆ రకమైన నినాదాలు ఇవ్వాల్సిన పని లేదని అంటున్నారు.
ఇక పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలుసు అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ అనుభవించిన వారు తీరా విపక్షంలోకి వచ్చాక ఏ మాత్రం పట్టనట్లుగా ఉన్నారు. రేపటి రోజున ఎన్నికలు దగ్గర పడగానే వారే మళ్లీ ముందుకు వచ్చి టికెట్ల రేసులో ఉంటారు. అపుడు అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్న దాని మీదనే బాబు మారినదీ లేనిదీ తెలుస్తుంది
అని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి టీడీపీకి సీనియర్లు ఒకనాడు ప్లస్ అయితే ఇపుడు వారే గుదిబండలుగా మారారు అన్న మాట వినిపిస్తోంది. వారిని కదిలించి కొత్త రక్తాన్ని నింపాలని పార్టీ పెద్దలకు ఉన్నా అది సులువుగా జరిగే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడంలేదు అంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆయా చోట్ల పాతుకుపోయిన సీనియర్లను తప్పించాలనుకుంటే ఎక్కడ దెబ్బ పడుతుందో అన్న ఆందోళన ఉండడం వల్లనే హై కమాండ్ కూడా పెద్దగా ప్రెషర్ పెట్టలేకపోతోంది అంటున్నారు.
దాంతో బాబు చెబుతున్న మాటలు ఇస్తున్న పిలుపులూ అన్నీ కూడా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. వైసీపీ మీద విరక్తి పుడితే కచ్చితంగా టీడీపీకే చాన్స్ ఉంటుంది కాబట్టి తాము కష్టపడకపోయినా అధికారంలోకి రావచ్చు అన్న ఆలోచనల్లో సీనియర్ నేతలు కొందరు ఉన్నారు. అయితే ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలని బాబు ఇస్తున్న పిలుపుని మాత్రం చాలా మంది విన్నా విననట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల బాబు మారుతున్నాను అని చెప్పుకోవాల్సి వస్తోంది
అయితే ఈసారి ఇది మాటలలో కాకుండా చేతలలో చూపించి సీరియస్ యాక్షన్ కి దిగితేనే టీడీపీలో సమూలమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. లేకపోతే నేను మారాను అని చెప్పుకోవడమే ఎపుడూ మిగిలుతుంది అని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో మార్పు రావాలంటే మాటలతో కాదనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.