Begin typing your search above and press return to search.
వారికి సపోర్టుపై చంద్రబాబు తర్జన భర్జన..!
By: Tupaki Desk | 6 Sep 2022 1:30 AM GMTరాజకీయాల్లో నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు.. ఆచి తూచి అడుగులు వేయాల్సిందే. అయితే .. ఒక్కొక్కసారి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు.. చేసే వెయిటింగ్ అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని.. టీడీపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అన్ని వర్గాలకు అండగా ఉండాలని.. చంద్రబాబు పార్టీ నాయకులకు పిలుపునిస్తున్నారు. అంతేకాదు.. ఉద్యమాలు కూడా చేపట్టాలని అంటున్నారు.
ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నాయకులకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం..రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపడం లేదు. రైతుల పరిస్థితి కూడా అంతే. ఇక, మిగిలిన వారిలో ఉద్యోగులు, నిరుద్యోగులు.. మాత్రం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో.. ఆయా వర్గాలకు అండగా ఉంటే.. వెంటనే వారు యూటర్న్ తీసుకుని.. టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే.. ఈ విషయంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తుండడంతో చేతులు కాలిపోయే పరిస్థితి వస్తోంది. సీపీఎస్ రద్దు చేయాలని .. ఉద్యోగులు కోరుతున్నారు. గతంలోనూ ఈ డిమాండ్ ఉన్నా.. అప్పటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువైంది.
ఈ క్రమంలో గతంలో ఏం జరిగింది.. అనే విషయాన్ని పక్కన పెట్టి.. దీనిపై చంద్రబాబు ఒక ప్రకటన చేసి.. తమ ప్రభుత్వం వస్తే.. ఇది చేస్తాం.. అని ఉద్యోగులకు భరోసా ఇస్తే.. వారి దృష్టి టీడీపీపై పడుతుందనేది.. క్షేత్రస్థాయిలో నాయకుల ఆలోచన.
కానీ, చంద్రబాబు.. ఉద్యోగులకు అలాంటి వరాలు ప్రకటించడం లేదు. ఇక, నిరుద్యోగులనైనా ఆయన తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయొచ్చు కదా.. అంటే.. అది కూడా లేదు. ఈ క్రమంలో ఈ రెండు వర్గాలను మచ్చిక చేసుకోవడం ద్వారా.. అంతో ఇంతో లబ్ధి పొందాలనే సీనియర్ల ఆలోచనలు బుట్టదాఖలవుతుండడం గమనార్హం. మరి దీనిపై చంద్రబాబు ఎలా ? ముందుకు వెళ్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.