Begin typing your search above and press return to search.

రాళ్లేశారంటే గెలుస్తున్న‌ట్టే.. చంద్ర‌బాబు న‌వ్వులే న‌వ్వులు!

By:  Tupaki Desk   |   5 Nov 2022 11:30 AM GMT
రాళ్లేశారంటే గెలుస్తున్న‌ట్టే.. చంద్ర‌బాబు న‌వ్వులే న‌వ్వులు!
X
కొన్ని కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే టీడీపీలోనూ ఎదురైంది. తాజాగా ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు నిర్వ‌హించిన రోడ్ షో కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు మ‌హిళ‌లు హార‌తులు ప‌ట్టారు కూడా. అయితే, ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కాన్వాయ్‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్లు రువ్వారు. దీంతోఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది చీఫ్ అధికారి గాయ‌ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. దీనిపై చంద్ర‌బాబు కేంద్రానికికూడా ఒక లేఖ రాయాల‌ని నిర్ణ‌యించా రు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో సీరియ‌స్‌గానే చ‌ర్చించారు. రాళ్లు వేసిన ఘ‌ట‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌ని నాయ‌కులు పేర్కొన్నారు. చంద్ర‌బాబు కూడా ఇప్ప‌టికే దీనిపై కేంద్రానికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. అదేవిదంగా సీసీటీవీ ఫుటేజ్ సేక‌రించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని కూడా నిర్ణ‌యించారు.

ఇదిలావుంటే, ఇంత సీరియ‌స్ ఘ‌ట‌న‌పై అంతే సీరియ‌స్‌గా చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక సీనియ‌ర్ నాయ‌కుడు .. ''మ‌న‌పై రాళ్లేశారంటే మ‌నం గెలుస్తున్న‌ట్టే స‌ర్‌. ఇందులో ఎలాంటి సందేహం లేదు'' అని అనేస‌రికి చంద్ర‌బాబు ఫ‌క్కున న‌వ్వేశారు.

దీనికి కొన‌సాగింపుగా స‌ద‌రు నాయ‌కుడు మాట్లాడుతూ.. రాజ‌కీయ నేత‌ల‌పై ఎక్క‌డ దాడి జ‌రిగినా.. వారికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌నే అర్థం స‌ర్‌. వారు గెలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాత సంగ‌తులు కొన్ని చెప్పుకొచ్చార‌ట‌.

అయితే, దీనిపైనా చంద్ర‌బాబు కొన్ని కామెంట్లు చేశారు. అయితే, అంద‌రం క‌లిసి రాళ్లేయించుకోవా ల‌నా? నీ ఉద్దేశం? అని ప్ర‌శ్నించారు. దీనికి ఆనేత ఉద్దేశ పూర్వ‌కంగా కాదు స‌ర్‌.. గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను బ‌ట్టి చెబుతున్నా స‌ర్ అని వెల్ల‌డించారు. దీనిని ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు మ‌రోసారి సూచించారు. రాళ్ల ఘ‌ట‌న‌పై ఏం చేయాలో అదే చేస్తాన‌ని చెప్పారు. మొత్తానికి సీరియ‌స్ విష‌యంలో ఇలా చంద్ర‌బాబు న‌వ్వులు చిందించ‌డం ఆస‌క్తిగామారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.