Begin typing your search above and press return to search.

చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు

By:  Tupaki Desk   |   19 March 2020 10:30 AM GMT
చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
X
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మృతి చెందాడని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్సార్సీపీ నాయకులు ఫొటోలు మార్ఫింగ్ చేసి పూలదండలు, అగరబత్తులు వెలిగించి రిప్ అని పేర్కొంటున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా అలాంటి పోస్టులు, ఫొటోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు మృతి అనే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వర్ల రామయ్య కోరారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వారి పట్ల ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీల పట్ల మరోలా స్పందిస్తోందని రామయ్య ఆరోపణలు చేశారు. తమ నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు, ఫొటోలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ పోస్టులపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందిస్తూ వారి తీరును ఖండించారు. వైఎస్సార్సీపీ నాయకులు మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.

‘కరోనా వైరస్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తి చనిపోయారని.. కుర్చీలో చంద్రబాబు ఫొటోకి.. దండవేసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలు గ్రూపుల్లో కనిపించిన ఈ ఫొటోలను పోలీసులకు ఆధారాలతో సహా అందించారు.