Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ లో టీడీపీ పోటీ..!
By: Tupaki Desk | 25 Sep 2019 9:56 AM GMTతెలంగాణ రాజకీయాల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలన్నీ ఈ ఉప ఎన్నిక మీదే కాన్ సంట్రేషన్ చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానం కావడంతో ఆ పార్టీకి ఈ సీటు గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకం. దీనికి తోడు ఉత్తమ్ ఇక్కడ నుంచి తన భార్య - కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతికి పట్టుబట్టి మరీ సీటు ఇప్పించుకున్నారు. ఇక గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి కేవలం 7 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఇక్కడ గెలిచిన ఉత్తమ్ కు షాక్ ఇవ్వడంతో పాటు లోక్ సభ ఎన్నికల్లో జరిగిన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సత్తా చాటాలని టీఆర్ ఎస్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఇక బీజేపీ సైతం ఇక్కడ నుంచి గతంలో టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన శ్రీకళారెడ్డి అభ్యర్థిత్వం ఖాయం చేస్తుందని తెలుస్తోంది. ఈ మూడు పార్టీల సంగతి ఇలా ఉంటే ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ సైతం సొంతంగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం అందరికి షాకింగ్ గా మారింది. అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే లేకుండా పోయింది. ఐదేళ్ల పాటు కొందరు సీనియర్లకు లేనిపోని ఆశలు కల్పించిన చంద్రబాబు చివరకు చేతులు ఎత్తేశారు.
ఏపీలో పార్టీ ఘోరంగా ఓడిపోవడం... ఇక ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టలేక కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడంతోనే ఆ పార్టీ పని ఖేల్ ఖతం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో సొంతంగా ఓటీ చేయాలని భావిస్తుండడం చాలా మందికి కామెడీగా అనిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు హైదరాబాద్ లో టీటీడీపీ పార్టీ నేతలు - కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పార్టీని బతికించుకోవడం చారిత్రక అవసరం అని చెప్పారు.
ఇక్కడ పోటీ చేసే ఆలోచనలో ఉన్న టీడీపీ ఇప్పటికీ ఏ పార్టీ అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వలేదని సమాచారం. గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ - కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇక్కడ టీడీపీ పోటీ చేసినా ఎంత వరకు ప్రభావం చూపుతుందన్నది చెప్పలేం. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉండేది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ప్రభావం చూపింది.
ఇప్పుడు ఆ పార్టీ కేడర్ తో పాటు ఓటు బ్యాంకు చెల్లాచెదురు అయిపోయింది. మరోవైపు మూడు బలమైన పార్టీలో పోటీలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నుంచి ఓ మోస్తరు అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో ఇక్కడ పోటీ చేయాలనుకోవడం.. ప్రభావం చూపాలనుకోవడం టీడీపీకి అత్యాశే కానుంది. టీడీపీకి ఓ మోస్తరు ఓట్లు కూడా రాకపోతే పోయిన పరువు ఇంకాస్త పోయినట్లవుతుంది. ఏదేమైనా హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - బీజేపీ మధ్య రసవత్తర పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నిక ఓ సవాల్ లాంటిదే.