Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ లో టీడీపీ కోవర్టులు?!

By:  Tupaki Desk   |   24 Dec 2018 11:30 AM GMT
వైఎస్సార్ కాంగ్రెస్ హై కమాండ్ లో టీడీపీ కోవర్టులు?!
X
రాజకీయ పార్టీల్లో కోవర్టులుగా పని చేసే వాళ్లు కూడా ఉంటారు. ఏపీ రాజకీయంలో కూడా కోవర్టు రాజకీయాలను చాలానే చూశారు జనాలు. ప్రత్యేకించి కొత్తగా ఆవిర్భవించే పార్టీల్లో, ఆవిర్భవించిన కొన్నాళ్లలో చేరి వచ్చే వాళ్లలో కోవర్టులు ఉంటారు. వీళ్లు తమ మాతృపార్టీ కి ఇక్కడి విషయాలను చేరవేస్తూ ఉంటారు. అవసరమైన సందర్భాల్లో ఈ పార్టీల నుంచి బయటకు వచ్చి తమ అసలు వేషాన్ని చూపుతూ ఉంటారు. ఇలాంటి విషయాలను తెలుగు ప్రజలు చాలానే చూశారు.

ఇక ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా కోవర్టుల కలకలం రేగుతోంది. జగన్ చుట్టూ చేరిన కొందరిలో తెలుగుదేశం పార్టీ కోవర్టులు ఉన్నట్టుగా సమాచారం. జగన్ దగ్గరి విషయాలను వీరు చంద్రబాబు కోటరికి తెలియజేస్తున్నట్టుగా తెలుస్తోంది.

విశేషం ఏమిటంటే.. ఈ కోవర్టులు వైకాపాలో ఉన్నత స్థాయి నేతలుగా ప్రచారం పొందుతూ ఉండటం. జగన్ నిర్ణయాలను ప్రభావితం చేసేంత వ్యక్తులుగా ఉన్న కొందరు తెలుగుదేశం పార్టీ కోవర్టులు అని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే.. జగన్ మోహన్ రెడ్డి ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో.. వీళ్లు తెలుగుదేశం పార్టీ అధినేత కోటరికీ ముందుగానే తెలియజేస్తున్నారు.

వివిధ విషయాల్లో వైసీపీ నేతలకు సమాచారం అందకనే..అది తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల వద్దకు చేరుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పలు ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ కోవర్టుల కథ ఏమిటో.. అందుకు సంబంధించిన వివరాలను.. త్వరలోనే తుపాకీ డాట్ కామ్ పూర్తి వివరాలను అందిస్తుంది.