Begin typing your search above and press return to search.
మునుగోడు ఉప ఎన్నికపై టీడీపీ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 13 Oct 2022 10:21 AM GMTతెలంగాణ పార్టీలే మునుగోడులో కొట్టుకుచస్తున్న వేళ దాదాపు ఇక్కడ అంతర్థానమైపోయిన పరిస్థితుల్లో కూడా ఆశ చావని టీడీపీ ఇక్కడ పోటీచేయాలని మొదట భావించింది. ఇంకా మిగిలిన కొందరు టీడీపీ నేతలు పోటీకి ఉబలాటపడ్డారు. చంద్రబాబును సంప్రదించారు. మునుగోడులో పోటీలో నిలబడేందుకు టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరును పార్టీ ఖరారు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. నేడు చంద్రబాబు ఈ మేరకు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు.
కానీ చంద్రబాబు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ప్రతిపక్షంలో కునారిల్లుతున్న ఈ టైంలో అనవసరంగా పోటీచేసి దారుణంగా ఓడి మరింత నైతిక స్థైర్థ్యం కోల్పోవడానికి ఇష్టపడలేదు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు వెల్లడించారు.
నాయకులు, కార్యకర్తలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న టీడీపీ.. పోటీకి దూరంగా ఉండాలని.. సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని.. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టిపెట్టాలని టీడీపీ నిర్ణయించడం జరిగిందని బక్కని నర్సింహులు పేర్కొన్నారు.
ఇప్పటికే బీజేపీ తరుఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డిలు మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్లకు చివరి రోజు రేపే.. అందుకే టీడీపీ నుంచి నిలబడుతారని అందరూ అనుకున్నారు.
కానీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లడంతో అనవసరంగా పోటీపడి పరువు పొగొట్టుకునే బదులు పోటీచేయకపోవడమే మంచిదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.