Begin typing your search above and press return to search.

అశోక్ కు ఇంటి పక్కనే ఓటమి

By:  Tupaki Desk   |   1 Nov 2016 5:56 AM GMT
అశోక్ కు ఇంటి పక్కనే ఓటమి
X
టీడీపీ సర్కారుపై గ్రామాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మాటలే తప్ప చేతలు కానరాకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో... అంతెందుకు అశోక్ మాట జవదాటని ప్రజలున్న విజయనగరం నగరం శివారుల్లోనే ఉన్న సారిక గ్రామంలో సర్పంచి పదవికి జరిగిన ఉప ఎన్నికే దీనికి నిదర్శనం. రాజుగారు కనిపిస్తే చాలు ఓట్లు వేసేసే జనం అక్కడుంటారు. కానీ.. టీడీపీ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన ఆ పరిస్థితి మార్చేసింది.. టీడీపీ వల్ల రాజుగారి ఇమేజి కూడా దెబ్బతిందో ఏమో సారిక ప్రజలు అశోక్ సూచనలు కూడా కాదనేశారు. వైసీపీకి ఓట్లేసి ఆ పార్టీ అభ్యర్థిని సర్పంచిగా గెలిపించారు.

కాగా విజయనగరం ఎంపీ - ఎమ్మెల్యే కూడా టీడీపీ నేతలే అయినా కూడా సిటీ పక్కనే ఉన్న గ్రామంలో పార్టీని గెలిపించలేకపోయారు. సారిక గ్రామం అటు పల్లెను - ఇటు పట్టణాన్నీ ప్రతిబింబిస్తుంది. రెండు రకాల వాతావరణం అక్కడ ఉంటుంది. ప్రజల్లో కూలి పనులు చేసుకునేవారు - రైతులు - ఉద్యోగులు - వ్యాపారాలు చేసేవారు - సామాజిక స్పృహ ఉన్నవారు... ఇలా అందరూ ఉన్నారు. రూరల్ - అర్బన్ రెండింటికీ ప్రతిబింబంలాంటి గ్రామంలో టీడీపీ మట్టి కరవడం క్లియర్ మెసేజి పంపించిందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం అంటున్నారు.

ఇక్కడ ఎలాగైనా గెలవాలని అధికారి పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అయినా విఫలమైంది. మద్యం - డబ్బు అన్నీ వెదజల్లడమే కాకుండా అధికారాన్ని చూపించి బెదిరింపులకూ దిగింది. అయినా ప్రజాబలం ముందు టీడీపీ వీగిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/