Begin typing your search above and press return to search.
పెనుగొండలో టీడీపీ ఘోర ఓటమి
By: Tupaki Desk | 17 Nov 2021 6:23 AM GMTఅనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం అంటే ముందుగా గుర్తుకొచ్చేది పరిటాల ఫ్యామిలీ మాత్రమే. సంవత్సరాలతరబడి నియోజకవర్గంపై పరిటాల రవి, పరిటాల సునీతకు ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. వీళ్ళ వారుసుడిగా పరిటాల శ్రీరామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ మంచి మెజారిటితో గెలిచింది. నియోజకవర్గాల పునర్విభజనలో పరిటాల ఫ్యామిలి పెనుగొండ నుండి రాప్తాడు నియోజకవర్గానికి షిఫ్టయ్యింది.
నియోజకవర్గం మారినా పరిటాల ఫ్యామిలి పట్టు ఇంకా పెనుగొండలో కంటిన్యు అవుతునే ఉందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 20 వార్డుల్లో 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులే ఘన విజయం సాధించారంటే పరిటాల ఫ్యామిలికి ఏమైందనే టాక్ మొదలైంది. అసల పరిటాల మునిసిపాలిటికి జరిగిన ఎన్నికలో పరిటాల ఫ్యామిలి టీడీపీ విజయానికి కృషిచేసిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
20 వార్డుల్లో 18 చోట్ల వైసీపీనే గెలిచిందంటే ఇది అధికారపార్టీ ప్రభంజనమనే చెప్పాలి. మామూలుగా అధికారపార్టీకి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ ఈ స్ధాయిలో ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని మాత్రం ఎవరు ఊహించలేదు. వైసీపీ గెలుచుకోగా మిగిలిన ఒక్క వార్డులో కూడా టీడీపీ గెలవలేదు. అంటే అన్నీ వార్డులకూ టీడీపీ పోటీచేసినా కనీసం ఒక్కవార్డులో కూడా గెలవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.