Begin typing your search above and press return to search.
టీడీపీ డిఫెన్స్ పాలిటిక్స్... నాయకుల్లో ఒక్కటే టెన్షన్..!
By: Tupaki Desk | 24 Jun 2022 11:30 PM GMTఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆత్మర క్షణ రాజకీయాలు జరుగుతున్నాయా ? అంటే.. ఔననే అంటున్నా రు పరిశీలకులు. నిజానికి చంద్రబాబు.. రెండేళ్ల ముందుగానే.. అభ్యర్థులను ప్రకటిస్తానని.. ఏడాది కిందట చెప్పారు. అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చే వరక కూడా అభ్యర్థులను ఖరారు చేసేది లేదన్నా రు. దీనికితోడు.. వచ్చే ఎన్నికల్లో మూడుసార్లు ఇప్పటికే ఓటమి చెందిన నాయకులకు టికెట్ ఇచ్చేదిలేద ని.. మహానాడు వేదికగా.. చంద్రబాబు తనయుడు చెప్పారు.
దీంతో నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. తమకు టికెట్ వస్తుందో రాదో.. అనే చర్చల్లో మునిగిపోయారు. అవకాశం ఉన్నవారు..చంద్రబాబు దగ్గర తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారని పార్టీలో చర్చ కూడా సాగుతుండడం గమనార్హం. ఇక, ఇప్పటికే దూకుడుగా ఉన్న నాయకులు తమకు ఫర్వా లేదని అనుకుం టున్నా..
తమపై సర్వేలు చేయిస్తున్నారనే వాదన వారికి తెలియడంతో వారు కూడా ఒకింత ఇబ్బందిగానే ఫీలవుతున్నారు. ఎందుకంటే.. త్యాగాలు చేయాలని.. చంద్రబాబు గతంలో చెప్పారు.
అయితే.. మహానాడుకు వచ్చే సరికి ఈ మాట ఎక్కడా చెప్పలేదు. అంటే.. వ్యూహాలు మారుతున్నాయనే సంకేతాలు వచ్చినట్టు అయింది. కానీ, దీనిపైనా.. చంద్రబాబు ఎక్కడా ఇతమిత్థంగా ప్రకటన చేయలేదు. అంటే.. పొత్తులు ఉంటాయా.. ఉండవా.. అనే డైలమా కూడా పార్టీలో కొనసాగుతోంది. ఒకవేళ ఉంటే.. జిల్లాకు రెండు చొప్పున నియోజకవర్గాలను పొత్తు పార్టీకి కేటాయించే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే.. ఏ నియోజకవర్గాలు ఇస్తారు? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
అందుకే నాయకులు ఇప్పుడు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. తీరాతాము ప్రజల మధ్యకు వచ్చి.. ఖర్చు పెట్టుకుని.. ఇప్పటి నుంచి తిరగడం ప్రారంభిస్తే.. ఎన్నికలకు ముందు తమకు టికెట్ ఇవ్వకపోయినా.. లేక.. పొత్తు పార్టీకి టికెట్ కేటాయించినా.. తమ పరిస్థితి ఏంటని..
ఉభయ గోదావరి జిల్లాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక, కర్నూలు, అనంతపురంలోనూ.. ఇదే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నాయకులు ఎక్కడికక్కడ ఆత్మ రక్షణలో పడ్డారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.