Begin typing your search above and press return to search.
గాంధీభవన్ ముట్టడించిన టీడీపీ నేతలు
By: Tupaki Desk | 28 Nov 2018 1:59 AM GMTమహాకూటమిలో అసమ్మతి చల్లారడం లేదు. పొత్తుల చిత్తుల్లో చితికిపోతున్న నేతలు రోడ్డెక్కుతున్నారు. మోసం చేసిన కాంగ్రెస్ పై నిరసనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ చేసిన ఈ మోసాన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు తాజాగా గాంధీభవన్ ను ముట్టడించారు.
గాంధీ భవన్ లో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు ఇబ్రహీం పట్నం నియోజకవర్గ టీడీపీ నేతలు షాకిచ్చారు. మేనిఫెస్టోను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి పాల్పడిందని టీడీపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముందే ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది.
ఇబ్రహీంపట్నం టికెట్ ను తాజాగా మహాకూటమిలో టీడీపికి కేటాయించారు. ఇక్కడ టీడీపీ తరుఫున సామ రంగారెడ్డి బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ తరుఫున టికెట్ ఆశించి భంగపడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరుఫున నామినేషన్ వేసి రెబల్ గా పోటీచేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ జెండాలతో ప్రచారం నిర్వహిస్తూ మహాకూటమి కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలను టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేయకుండా ఆయన తనవెంటే తిప్పుకుంటున్నారు.
ఇలా ఇబ్రహీం పట్నంలో కాంగ్రెస్ రెబల్ మల్ రెడ్డి రంగారెడ్డి.. టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు కుట్రలు పన్నడంపై స్థానిక టీడీపీ నేతలు భగ్గుమన్నారు. మల్ రెడ్డి బ్రదర్స్ ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని.. టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి విజయం కోసం కృషి చేసేలా చూడాలని వారు గాంధీ భవన్ ను తాజాగా ముట్టడించారు. మల్ రెడ్డి బ్రదర్స్ ను సస్పెండ్ చేసే వరకూ గాంధీ భవన్ నుంచి కదిలేది లేదని వారు హెచ్చరిస్తున్నారు..
ఇలా కూటమిలో కాంగ్రెస్ ఎత్తులకు టీడీపీ చిత్తవుతోంది. ఓవైపు టీడీపీకి టికెట్ ఇచ్చి మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థికి తెరవెనుక సపోర్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. ఈ అసమ్మతి సెగ గాంధీభవన్ ను తాకుతోంది. మరి ఇది వారి విజయావకాశాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందనేది వేచి చూడాల్సిందే..