Begin typing your search above and press return to search.
నంద్యాలలోనూ టీడీపీ నోటుతో బుక్కైందే!
By: Tupaki Desk | 21 Aug 2017 4:55 AM GMTనంద్యాల ఉప ఎన్నికల్లో ఓటింగ్ కు మరో రెండు రోజులే ఉండటంతో.. టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. మంత్రులు - 25 మంది ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీలోని ముఖ్య నేతలను ప్రచారంలో దించి.. వార్డులు - వీధుల వారీగా అప్పగించినా.. ప్రజలను మభ్యపెట్టేందుకు వరుస హామీలు గుప్పించినా.. నానాటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కోలో ఓటమి భయం నానాటికీ పెరుగుతోంది. ఇక డబ్బులు కుమ్మరించేందుకు సిద్ధమైపోతున్నారు టీడీపీ నేతలు! ఒక్క ఓటుకు వేలు కుమ్మరించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా వైసీపీకి పట్టుఉన్న ప్రాంతాల్లో సుమారు ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కూడా టీడీపీ నేతలు ఏమాత్రం సంశయించడం లేదంటే.. టీడీపీలో భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ డబ్బుల పంపిణీకి తెర తీసింది. పబ్లిక్ గానే టీడీపీ నేతలు ఒక్కో ఓటుకు భారీ మొత్తంలో చెల్లిస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. నంద్యాలలోని 20వ వార్డులో రైతు నగర్ సర్పంచి కొండారెడ్డి ఒక్కో ఓటుకు రూ. 5 వేలు పంచుతూ కెమెరా కంటికి దొరికి పోయాడు. ఓటర్లకు డబ్బు ఇస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయమని కూడా ఆయన చెబుతున్నాడు. క్రాంతి నగర్ లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ తరపున డబ్బుల పంపిణీ చేశాడు.
ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ప్రజలకు డబ్బు పంచుతుండగా కెమెరా కంటికి చిక్కాడు. కొండారెడ్డి భూమా కుటుంబానికి దగ్గరి వ్యక్తిగా తెలుస్తోంది. వైసీపీ ఓటు బ్యాంకు ఉన్న చోట ఏకంగా ఒక్కో ఓటుకు రూ.10 వేలు కూడా ఇవ్వడానికి టీడీపీ నేతలు వెనకాడటం లేదని సమాచారం. వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని.. ఇలాంటి ప్రలోభాలకు తెర తీసినట్లు సమాచారం. టీడీపీ ప్రచారానికి వచ్చిన సీఎం బావమరిది - ఎమ్మెల్యే బాలకృష్ణ.. స్వయంగా కాన్వాయ్ పై నుంచే డబ్బులు పంచుతూ బుక్కయిపోయిన విషయం తెలిసిందే!