Begin typing your search above and press return to search.
ఆ జిల్లాలో వైసీపీని డామినేట్ చేస్తోన్న టీడీపీ ...!
By: Tupaki Desk | 24 Sep 2021 2:30 AM GMTప్రకాశం జిల్లా వైసీపీలో పెద్ద కలకలం రేగింది. కొన్నాళ్లుగా.. నేతల మధ్య సఖ్యత లోపించడంతో.. ఇక్కడ పరిస్థితులు పార్టీకి సానుకూల వాతావరణం కూడా కరువయ్యాయి. దీంతో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైందనే మాటే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జిల్లా సమస్యలపై అప్పటి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ నాయకులు స్పందించారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యంగా వెలిగొండ వంటి ప్రాజెక్టు విషయంలో వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో ఇక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ఈ జిల్లా కు వరప్రదాయిని వంటి.. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ఇటీవల తీవ్రస్థాయిలో తెలంగాణతో మనకు రాజకీయ ఘర్షణ ఏర్పడింది. వాస్తవానికి ఇది 1996లోనే జీవం పోసుకుంది. అయితే.. అప్పటి నుంచి రాజకీయ గ్రహణాలతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇదే విషయంపై గతంలో వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేశారు. అయితే.. కొన్ని ప్రయత్నాల తర్వాత.. ఈ ప్రాజెక్టు.. తుదిదశకు చేరుకుంది. రేపో మాపో.. దీనిని ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం కూడా సమాయత్తమైంది. ఇంతలోనే ఈ ప్రాజెక్టుకు నీటిని ఇవ్వొద్దని, నిధులు కూడా ఇవ్వద్దని పేర్కొంటూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.
అదే సమయంలో కేఆర్ ఎంబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇది అక్రమ ప్రాజెక్టు అని తేల్చింది. ఈ పరిణామానికి తోడు విభజన చట్టంలో పేర్కొన్న ఏడు ప్రాజెక్టుల్లో వెలిగొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. దీనిని కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో చేర్చకపోవడం.. తెలంగాణ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. దీంతో వెంటనే ఈ ప్రాజెక్టును నిలిపివేశేలా ఆదేశించాలని కోరుతూ..కేంద్రానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే.. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించాల్సిన వైసీపీనాయకులు, మంత్రులు మౌనంగా ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం.. మీడియా ముందుకు కూడారాలేదు. ఇది ఫుల్లు మైనస్‌గా మారిపోయింది.
ఇక, ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి టీడీపీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు.. నలుగురు.. లేఖ రాశారు. ఇది తగదని.. పేర్కొన్నారు. జిల్లాలో నీటి ఎద్దడి కారణంగా..ఇక్కడి ప్రజలు నానా తి ప్పులు పడుతున్నారని.. ఇప్పుడు వెలిగొండ కూడా ఆగిపోతే. తమకు తిప్పలు తప్పవని వారు పేర్కొన్నా రు. తమ జిల్లాను ఇబ్బంది పెట్టొద్దని వారు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు అన్నివివరాలతో కేసీఆర్‌కు లేఖను పంపారు. మరి ప్రతిపక్ష నేతలుగా వారు చేసిన పనిలో పావలా వంతైనా.. వైసీపీ నేతలకు బాధ్యత లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న.గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో 4 స్థానాలు మినహా..అన్నీ.. వైసీపీకి అప్పగించారు ఇక్కడి ప్రజలు.
ఇక, ప్రతిపక్షంలో ఉండగా వెలిగొండ కోసం.. నాటి ఒంగోలు ఎంపీగా.. వైవీ సుబ్బారెడ్డి (ప్రస్తుత టీటీడీ చైర్మన్) పాదయాత్ర కూడా చేశారు. మరి ఇప్పుడు ఏమయ్యారు? అధికార పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు ఇక్కడ వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? వీరంతా నిద్ర పోతున్నారా? లేక కేసీఆర్ అంటే.. భయపడుతున్నారా? కనీసం ప్రతిపక్ష నేతలకు ఉన్నపాటి బాధ్యత వైసీపీ నేతలుగా.. ప్రజలు ఓట్లేశారనే విజ్ఞత కూడా చూపించలేక పోతున్నారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక, ఇప్పటికీ.. ఈ సమస్య రగులుతూనే ఉంది. తాజాగా కూడా కేసీఆర్.. కేంద్రానికి వెలిగొండను పక్కన పెట్టాల్సిందేనని లేఖ రాశారు. మరి ఇప్పటికైనా.. వైసీపీ కళ్లు తెరుస్తుందో లేదో చూడాలి.