Begin typing your search above and press return to search.

టీవీ చానళ్ల డిబేట్లకు మొహం చాటేస్తున్న దేశం మాజీలు!

By:  Tupaki Desk   |   4 Nov 2019 2:30 PM GMT
టీవీ చానళ్ల డిబేట్లకు మొహం చాటేస్తున్న దేశం మాజీలు!
X
ఒక పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరఫున మాట్లాడేందుకు ఆ పార్టీల నేతలు గట్టిగానే ముందుకు వస్తారు. అలా మాట్లాడి జనం దృష్టిలో పడి, తద్వరా అధినాయకత్వం దృష్టిలో పడాలనేది వారి ప్రయత్నం. అయితే ఏదైనా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోగలిగే వారే అసలైన ఆ పార్టీ భక్తులు. ఇది రాజకీయ సిద్ధాంతం. అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని వంటపట్టించుకున్న వాళ్లు తక్కువగానే కనిపిస్తూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇలాంటి కష్టాలే వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. టీవీ చానళ్ల చర్చా కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా మంది మొహం చాటేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు డజనుకు పైగా యాక్టివ్ వార్తా చానళ్లున్నాయి. వాటిల్లో రెండు పూట్లా చర్చా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే అలాంటి వాటిల్లో ప్రతిపక్ష పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ల అవసరం ఎంతైనా ఉంది.

అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అలాంటి యాక్టివ్ పొలిటీషియన్లు తక్కువమంది కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు టీవీ చర్చా కార్యక్రమాల్లో అసలు అగుపించడమే లేదు!
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా దర్జాలు అనుభవించిన వాళ్లు ఇప్పుడు మాత్రం తమ మొహాలను చూపించి పార్టీ తరఫున వాదిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

పార్టీ అధికారంలో లేని వేళ కష్టపడటానికి వారు ముందుకు రావడం లేదని స్పష్టం అవుతోంది. అయితే ఇందుకు ప్రధానంగా మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. అదే టీడీపీ మాజీలకు ఉన్న బొక్కలు.
అధికారంలో ఉన్నప్పుడు విపరీతస్థాయిలో వ్యవహరించిన వారు, దోపిడీ చేసిన వారే అధికం.అయితే ఇప్పుడు అధికారం చేతిలో లేదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే.. ఏం ముంచుకుస్తోందో అనేది తెలుగుదేశం పార్టీ నేతల భయంగా తెలుస్తూ ఉంది. అందుకే టీవీ చానళ్లకు ఎక్కడి పార్టీ తరఫున మాట్లాడటానికి వారు ముందుకు రావడం లేదనేది ఒక టాక్!