Begin typing your search above and press return to search.
అర్థరాత్రి హైడ్రామా.. మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు.. అసలేం జరిగింది?
By: Tupaki Desk | 28 July 2021 4:07 AM GMTఅసలేం జరిగింది? మాజీ మంత్రి దేవినేని ఉమను ఎందుకు అరెస్టు చేశారు? ఆ మాటకు వస్తే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? మంగళవారం రాత్రి వేళలో.. టీవీ చానళ్లలో.. వాట్సాప్ గ్రూపుల్లో దేవినేని ఉమ కాన్వాయ్ ను అడ్డుకొన్న వీడియోలు.. బండ బూతులు తిట్టేస్తూ.. కారు దిగాలంటూ ఆగ్రహావేశాల్ని ప్రదర్శించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మాజీ మంత్రిగా ఉన్న దేవినేని ఉమకు క్రిష్ణా జిల్లాలో ఉన్న ఇమేజ్ ఎంతన్నది తెలుసు. అలాంటి నేత కాన్వాయ్ ను అడ్డుకోవటం.. ఆయన కారుపై రాళ్లు విసిరిన వైనం షాకింగ్ గా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అటవీ భూముల్లో గ్రావెల్ దోపిడీ జరుగుతుందన్న పేరుతో భూముల పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమ.. మంగళవారం అర్థరాత్రి ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
క్రిష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి దేవినేని ఉమ ఒక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన అధ్యక్షతన నాయకులంతా కలిసి కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. గతంలో అక్కడ అక్రమంగా తవ్వకాలుజరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. గ్రావెల్ ను అక్రమంగా తవ్వుతున్న వాహనాల్ని సీజ్ చేసిన అటవీ అధికారులు.. ఇప్పుడా వాహనాలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. కొండల్ని.. గుట్టల్ని వైసీపీ నేతలు అక్రమంగా తవ్వేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ వీడియోను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాసేపటికే ఈ వీడియోలు కాస్తా వైరల్ అయ్యయి. దీంతో వైసీపీ కార్యకర్తలు కొందరు దేవినేని ఉమ తిరిగి వచ్చే ప్రాంతమైన గడ్డ మణుగు వద్ద కాపు కాశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మాజీ మంత్రిని డొంకరోడ్డులోని జి. కొండూరుకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ వర్గీయులు (?) రోడ్ల మీదకు వచ్చి టీడీపీ నేతల వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఒక టీడీపీ నేత కారు ధ్వంసమైంది.
పోలీసుల సెక్యురిటీ మధ్య టీడీపీ నేతల వాహనాలు జి.కొండూరు స్టేషన్ సమీపానికి చేరుకున్న వేళ.. వైసీపీ నేత ఒకరు స్టేషన్ వద్దకు చేరుకొని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు.. అతడి కారు అద్దాల్ని ధ్వంసం చేశారు. దీంతో సదరు నేతను అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఉదంతం స్థానికంగా మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. దేవినేని ఉమను స్టేషన్ కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మైలవరం.. జి.కొండూరు.. ఇబ్రహీంపట్నం మండలాల వైసీపీ.. టీడీపీ నేతలు.. కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో..స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు.
ఈ సమయంలోనే ఎమ్మెల్యే క్రిష్ణ ప్రసాద్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా.. ఆయన్ను ఇబ్రహీం పట్నం వద్దకు రాగానే ఆయన అడ్డుకొని వెనక్కి పంపారు. పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండటంతో దేవినేని ఉమను తీసుకొస్తున్న కారును కాస్త దూరంలోనే నిలిపివేశారు. రాత్రి ఏడుగంటల సమయం నుంచి ఆయన కారులోనే ఉన్నారు. జరిగిన ఉదంతంపై తాను కంప్లైంట్ చేస్తానని చెప్పినా పోలీసులు అందుకు ఒప్పుకోవటం లేదని టీడీపీ వర్గీయులు వాదిస్తున్నారు.
టీడీపీ నేతలు.. కార్యకర్తల అత్యుత్సాహంతోనే తాజా ఉద్రికత్త నెలకొందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కారులో నుంచి బయటకు రావాలని.. పరిస్థితి మారేందుకు తమకు కోఆపరేట్ చేయాలని పోలీసులు ఎంతగా కోరినా దేవినేని ఉమ కారు దిగి బయటకు రాలేదు. కారులోనే ఉండిపోయారు. అద్దాలు బిగించుకొని కూర్చున్నారు. పోలీసులు ఎంత చెప్పిన ఆయన తీరులో మార్పు రాకపోవటంతో.. అర్థరాత్రి వేళలో క్రేన్ తెప్పించారు. ఉమ కూర్చున్న కారు అద్దాలు బ్రేక్ చేసి.. డోర్ ఓపెన్ చేశారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు.
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత (సుమారు ఒంటి గంట తర్వాత) దేవినేని ఉమను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దీనిపై టీడీపీ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చినోళ్లనే అరెస్టుచేస్తారా? అని మండిపడుతున్నారు. కుట్ర పూరితంగానే దేవినేని ఉమను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విమర్శలకు స్పందించటంలేదు.
దేవినేని ఉమపై నమోదు చేసిన కేసులు.. వాటి సెక్షన్లు తర్వాత ప్రకటిస్తామని పేర్కొనటం గమానార్హం. తనపై దాడి జరిగిన చాలాసేపటి వరకు పోలీసులు రాలేదని దేవినేని ఉమ ఆరోపిస్తుంటే.. ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు.. అల్లర్లు ప్రేరేపించేందుకే దేవినేని ఉమ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే క్రిష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.