Begin typing your search above and press return to search.

రాత్రి 11 గంటల వేళ.. భోజనం చేస్తున్న టీడీపీ మాజీ మంత్రి అరెస్టు

By:  Tupaki Desk   |   10 Nov 2021 4:48 AM GMT
రాత్రి 11 గంటల వేళ.. భోజనం చేస్తున్న టీడీపీ మాజీ మంత్రి అరెస్టు
X
ఒకరు తర్వాత ఒకరు చొప్పున ఏపీ విపక్ష నేతలు పలు విషయాల్లో అరెస్టు అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మాజీ మంత్రి చిత్తూరు జి్లలాకు చెందిన అమర్ నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు తాజా వివాదం గా మారింది. ఎందుకంటే.. రాత్రి పదకొండు గంటల వేళ లో భోజనం చేస్తున్న మంత్రి ని చుట్టు ముట్టిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకూ జరిగిందేమంటే.. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ నామినేషన్ ను ఫోర్జరీ సంతకం తో ఉపసంహరించుకున్నట్లుగా చూపటం తో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్ట డించటం తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి టీడీపీ కి చెందిన 19 మంది నేతల పై కేసులు నమోదు చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల వేళలో చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి ఆధ్వర్యం లో పోలీసులు మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు బయలుదేరారు.

ఆయన కుప్పం పట్టణం లోని బీసీఎన్ రిసార్ట్స్ లో బస చేసినట్లుగా తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న ఆయన్ను చుట్టుముట్టిన పోలీసులు.. ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి అమర్ నాథ రెడ్డితో పాటు టీడీపీ చిత్తూరు ఎంపీ నియోజక వర్గ అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చింది.

అంతే కాదు.. కుప్పం లో కాకుండా వేరే ప్రాంతం లో ఉన్న ఎమ్మెల్సీ దొర బాబుకు 41ఏ కింద నోటీసులు ఇచ్చి.. అరెస్టు చేసి వారి సొంత ప్రాంతాల కు తరలించినట్లు గా పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తాజాగా కొత్త రాజకీయ రగడ కు కారణం గా మారుతోంది. అర్థరాత్రి వేళ లో ఇంత హడా వుడిగా.. మాజీ మంత్రిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా? అన్న మాట వినిపిస్తోంది.