Begin typing your search above and press return to search.
మాజీ ఎమ్మెల్యే కొడుక్కి రెండోపెళ్లి ..పెళ్లి పెద్దలుగా టీడీపీ మాజీ మంత్రులు!
By: Tupaki Desk | 12 Jun 2020 10:31 AM GMTతప్పుడు పనులు చేస్తుంటే, ఇది తప్పు అని చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే , ఆ కార్యానికి పెద్దలుగా మరి దగ్గరుండి మరి జరిపించడానికి ప్రయత్నం చేసారు. ఓ మాజీ ఎమ్మెల్యే తన కొడుక్కి మొదటి భార్య ఉండగానే ..రెండో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే ...ఆమెకి బుడ్డి చెప్పాల్సింది పోయి, ఆ పెళ్ళికి పెద్దలుగా మారారు మాజీ మంత్రులు, టీడీపీ కీలక నేతలు. అయితే, ఆ పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి స్వగ్రామం తొండంగి మండలం ఏవీ నగరం దీనికి వేదిక అయ్యింది.
కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకి మాజీమంత్రులు యనమల, చినరాజప్పతో పాటుగా పలువురు టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ..ఆ పెళ్లి జరుగుతున్న వేదిక వద్దకి బయల్దేరారు. అయితే, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో యనమల, చినరాజప్ప, ఇతర టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. తాము వెళ్లేసరికి కల్యాణ వేదిక వద్ద పెళ్లి కుమారుడు, కుటుంబ సభ్యులు ఉన్నారని, దీనితో ఆ పెళ్లిని నిలిపివేశామని పోలీసులు తెలిపారు. తనను వదిలించుకుని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాధాకృష్ణ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంజుప్రియ డిమాండ్ చేశారు. అలాగే అతడికి కొంతమంది మాజీమంత్రుల మద్దతు ఉందని ఆరోపించారు.