Begin typing your search above and press return to search.

గెలుపు గుర్రాల వేట‌లో టీడీపీ ఫెయిల్‌... అట్ట‌ర్‌ప్లాప్‌...!

By:  Tupaki Desk   |   14 Dec 2022 4:55 AM GMT
గెలుపు గుర్రాల వేట‌లో టీడీపీ ఫెయిల్‌... అట్ట‌ర్‌ప్లాప్‌...!
X
వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని, తాము గెలిచి తీరాల‌ని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు గెలుపు గుర్రాల వేట‌లో వెనుక‌బ‌డుతున్నారా? వారిని ద‌రిచేర‌నివ్వ‌డాన్ని అడ్డుకుంటున్న వారిని చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలోని సుమారు 10 నియోజ‌కవ‌ర్గాల్లో.. కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నారు. వారికి టికెట్ ఇవ్వాలే కానీ.. గెలిచి చూపిస్తారు.

అది టీడీపీకే కాదు.. వారికి కూడా వ్య‌క్తిగ‌తంగా చాలా ప్ర‌తిష్టాత్మ‌కం. అయితే, వారంతా వైసీపీని కాద‌ని.. టీడీపీవైపు చూస్తున్నా.. చంద్ర‌బాబు వారిని చేర‌నివ్వ‌డం లేదా? లేక‌.. కొంద‌రు నాయ‌కులు చ‌క్రం తిప్పి వారిని చేర‌నివ్వ‌డం లేదా? అనేది ప్ర‌శ్న‌. దీనిలో రెండోదే రైట్ అని చాలా మంది నాయ‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇలాంటి వారిని పార్టీలోకి రానిస్తే.. త‌మ‌కు ప్లేట్ తిర‌గ‌బ‌డుతుంద‌నేది వారి వాదన.

ఉదాహ‌ర‌ణ‌కు.. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి టీడీపీలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ, త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని అంటున్నారు. అయితే, ఇక్క‌డ టీటీడీ మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప‌డనివ్వ‌డం లేదు. ఆయ‌న‌కు ఉన్న కీల‌క నేత ప‌లుకుబడి తో డీఎల్‌కు అడ్డుప‌డుతున్నారు. దీంతో ఈ సీటును మ‌రోసారి వ‌దులుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ముస్లిం బైనారిటీ వ‌ర్గానికి చెందిన ఒక నాయ‌కుడు టీడీపీలో చేరాల‌ని, కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈయ‌న‌కు చాలానే వ్యాపారాలు ఉన్నాయి. సో బ‌లంగా ఉన్నాడు. కానీ, ఈయ‌న ఊసు చంద్ర‌బాబు వ‌ర‌కువెళ్లినా.. స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. ఇది కూడా పోగొట్టుకోవ‌డం త‌ప్ప‌.. ఫ‌లితం ద‌క్క‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రామ‌కృష్ణ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు. ఆయ‌న వ‌స్తే.. ఉత్త‌రాంధ్ర‌పై టీడీపీ ప‌రిస్థితి మ‌రింత మెరుగ‌వుతుంది. కానీ, ఆయ‌న‌కు కూడా ఇవే చిక్కులు. నెల్లూరుకు చెందిన ఆనం కుటుంబం కూడా టీడీపీ పంచ‌న చేరేందుకు రెడీగా ఉంది.

అయితే.. ఆనం వ‌స్తే ఆధిప‌త్య రాజ‌కీయాలు వ‌స్తాయని చెబుతున్న ఒక మాజీ మంత్రి దీనికి అడ్డు ప‌డుతున్నారు. అనంత‌పురంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఇలా.. దాదాపు 10 మంది నాయ‌కులు.. టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నా.. కొన్ని శ‌క్తులుఅడ్డుప‌డుతుండ‌డం. చంద్ర‌బాబు కాద‌న‌లేక పోవ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.