Begin typing your search above and press return to search.

క‌మ్యూనిస్టుల గ్యాప్‌ను టీడీపీ భ‌ర్తీ చేస్తోందా ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 11:30 AM GMT
క‌మ్యూనిస్టుల గ్యాప్‌ను టీడీపీ భ‌ర్తీ చేస్తోందా ?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కమ్యూనిస్టుల‌కు ఛాన్స్ ఇవ్వడం లేదా? వారి క‌న్నా దూకుడుగా టీడీపీ ముందుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాలు అనే మాట మ‌న‌కు క‌మ్యూనిస్టుల నుంచే వినిపించేది. ప్ర‌భుత్వాలు ఏవైనా.. కూడా అవి తీసుకున్న నిర్ణ‌యాల్లోని లొసుగులను గుర్తించి.. వాటి ఆధారంగా ప్ర‌జా ఉద్య‌మాలు నిర్వ‌హించ‌డం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లడం.. ప్ర‌జా బ్యాలెట్ నిర్వ‌హించ‌డం.. వంటివి క‌మ్యూనిస్టు విధానాలుగా ప‌రిశీల‌కులు చెబుతారు. అయితే.. ఇప్పుడు క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఈ గ్యాప్‌ను టీడీపీ భ‌ర్తీ చేస్తోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై అన్ని రూపాల్లోనూ ఉద్య‌మాలు చేసేందుకు టీడీపీ సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే రెండు న్న‌రేళ్ల‌లో అనేక ఉద్య‌మాలు చేసిన టీడీపీకి ఆశించినంత మైలేజీ ద‌క్క‌లేదు. నేరుగా చంద్ర‌బాబు రంగంలోకి దిగిన ఇసుక‌, మ‌ద్యం అమ్మ‌కాలు వంటివి మిన‌హాయిస్తే.. మిగిలిన‌వి పెద్ద‌గా మైలేజీ ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు క‌మ్యూనిస్టులు అనుస‌రించిన బాట‌లోనే న‌డ‌వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు.

త్వ‌ర‌లోనే నాయ‌కులు అంద‌రూ.. ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని.. ప్ర‌జ‌ల‌మ‌ధ్యే ఉండాల‌ని ఆయ‌న తాజాగా ఆదేశించారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌జాబ్యాలెట్ న‌నిర్వ‌హించాల‌ని కూడా బాబు చెప్పారు. తాజాగా చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌ల‌ను బ‌ట్టి..త్వ‌ర‌లోనే పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి రానున్నార‌ని తెలుస్తోం ది. నిజానికి ఉద్య‌మాల‌కు వ్య‌తిరేకి అయిన‌.. చంద్ర‌బాబు ఇలా నిర్ణ‌యంతీసుకోవ‌డం.. ఆశ్చ‌ర్యంగానే అనిపించినా. పుంజుకుంటున్న గ్రాఫ్‌ను మ‌రింత పెంచాల‌నే ఉద్దేశంతో ఆయ‌న అడుగులు వేస్తున్నార‌ని.. పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికీ.. టీడీపీ పుంజుకోలేక పోయింద‌నేది వాస్త‌వం. కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. పార్టీ పునాదులు బ‌ల‌హీనంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండేలా కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. మ‌రి ఇది స‌క్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.