Begin typing your search above and press return to search.

కంగ్రాట్స్ బాబు : గోదావ‌రి తీరం చెంత ప‌సుపు జెండాల రెప‌రెప‌లు !

By:  Tupaki Desk   |   27 July 2022 4:01 AM GMT
కంగ్రాట్స్ బాబు : గోదావ‌రి తీరం చెంత ప‌సుపు జెండాల రెప‌రెప‌లు !
X
చాలా రోజుల త‌రువాత తెలుగుదేశం పార్టీకి చెప్పుకోద‌గ్గ గెలుపు. మీసం మెలేసి మ‌రీ చెప్పుకోద‌గ్గ లేదా చాటింపు వేసుకోద‌గ్గ గెలుపు తూర్పుగోదావ‌రి తీరాన ల‌భించింది. ఇక్క‌డి కొవ్వూరు కో ఆప‌రేటివ్ అర్బ‌న్ బ్యాంక్ పాలక మండ‌లి ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది.

మొత్తం 11 స్థానాల‌నూ టీడీపీనే గెలుచుకుని విజ‌య దుందుభి మోగించింది. నిన్న‌టిదాకా ప‌గోలో ఉన్న కొవ్వూరు కాస్త కొత్త జిల్లాల ఏర్పాటు పేరిట జ‌రిగిన విభ‌జ‌న పుణ్య‌మాని తూగోలో వ‌చ్చి చేరిపోయింది.

ఈ విధంగా చేరాక జ‌రిగిన అక్క‌డి అర్బ‌న్ బ్యాంక్ ఎన్నిక‌ల్లో ముఖ్యంగా హోం మంత్రి తానేటి వ‌నిత సార‌థ్యం వ‌హిస్తున్న కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండాలు రెప‌రెప‌లాడాయి.

ఎన్నిక ఏద‌యినా స‌రే విజ‌యం మాదే అని వైసీపీ ప‌దే ప‌దే చెప్పే మాట‌ల‌కు ఈ సారి మాత్రం టీడీపీ బ్రేక్ వేయ‌గ‌లిగింది. అక్క‌డి గ్రూపు రాజ‌కీయాల కార‌ణంగా టీడీపీ గెలుపు సునాయాసం అయింద‌ని వైసీపీ వ‌ర్గీయులే ఒప్పుకుంటూ మీడియా ఎదుట స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

వైసీపీ వాద‌న‌లు ఎలా ఉన్నా , ఫిర్యాదులు ఎలా ఉన్నా రాష్ట్రంలో ఏ సొసైటీకి ఎన్నిక‌లు నిర్వ‌హించినా తామే గెలుస్తామ‌ని టీడీపీ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానిస్తోంది. 1983 నుంచిఇక్క‌డ తెలుగుదేశం పార్టీ హ‌వా నడుస్తోంది.

అర్బ‌న్ బ్యాంక్ కు సంబంధించిన పాల‌క మండ‌లి ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌త‌కలు జరిగేయని వైసీపీ ఆరోపిస్తూ జిల్లా స‌హ‌కార అధికారికి ఫిర్యాదు సైతం చేసింది. కానీ టీడీపీ వాద‌న మాత్రం మ‌రో విధంగా ఉంది. సొసైటీ కి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే తాము గెలుస్తామ‌న్న ఉద్దేశంతోనే ప్ర‌భుత్వ క‌మిటీల పేరిట వైసీపీ కొత్త నాట‌కం ఒక‌టి న‌డిపిస్తోంద‌ని,ఇది పూర్తిగా నిబంధ‌న‌ల‌కే విరుద్ధం అని అంటోంది.