Begin typing your search above and press return to search.
పామర్రులో మైలైజీ రాదేమీ 'కుమార'?
By: Tupaki Desk | 16 Nov 2022 1:30 AM GMTఎత్తులు-పైఎత్తులు ఎన్ని వేసినా ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చిక్కని నియోజకవర్గం. పోనీ పరోక్షంగా అక్కడి ఎమ్మెల్యేను మలుపుకొన్నా.. నిలవడం లేదు. ఏం చేద్దామబ్బా ..? అని సీనియర్ నాయకుడి కుమారుడిని బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఆశించిన స్థాయిలో దూసుకెళ్లడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు ఆ నియోజకవర్గంపై అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలన చేయాల్సి ఉంటోంది.
మూడుసార్లూ ఓటమే..
2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత పామర్రు ఏర్పడింది. అప్పటినుంచి ఈ నియోజకవర్గంలో గెలుపు తెలుగుదేశానికి ఎండమావే అవుతోంది. మూడుసార్లూ ఆ పార్టీకి ఓటమే ఎదురైంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత జిల్లా అయిన క్రిష్ణాలోనే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. మరోవైపు పార్టీ బలంగా లేదని చెప్పడానికీ అవకాశం తక్కువే. పామర్రుకే చెందిన వర్ల రామయ్య టీడీపీలో సీనియర్ నాయకుడు. పొలిట్ బ్యూరో సభ్యులు కూడా. దీంతో 2014లో పార్టీ ఊపు కనిపించిన సందర్భంలో పామర్రు నుంచి ఆయన పోటీ చేశారు. కానీ, స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే తదనంతర పరిణామాల్లో ఇక్కడి ఎమ్మెల్యే టీడీపీ వైపు మొగ్గారు.
వైసీపీ ఎమ్మెల్యేను కలుపుకొన్నా..
పామర్రు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున దోవరి ఏసుదాస్ గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీలో ఉన్న ఆ సమయంలో 6,940 ఓట్లతో కాంగ్రెస్ గెలుపొందింది. ప్రజారాజ్యం 23 వేల ఓట్లు సాధించింది. టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా, 2014కు వచ్చేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పోటీలోకి వచ్చింది. ఆ పార్టీ తరఫున ఉప్పులేటి కల్పన పోటీ చేశారు.
వర్ల రామయ్యను కేవలం 1,069 ఓట్ల తేడాతో ఓడించారు. అయితే, కల్పన కొద్ది రోజులకు అప్పటి అధికార పార్టీ టీడీపీలో చేరారు. 2019కి వచ్చేసరికి కల్పనకు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. కానీ, వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ చేతిలో ఆమె 30,873 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. తదనంతరం వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజాకు నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. కల్పన రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కుమార్ రాజాకు మార్గం మరింత సుగమమైంది. కానీ, ఆయన దూకుడుగా వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రయత్నిస్తున్నా మైలేజీ రాదేం..?
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ చేపట్టిన కార్యక్రమాల్లో కుమార్ రాజా పాల్గొంటున్నా మైలేజీ రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కుమార్ రాజా ప్రభావవంతంగా లేకపోవడమే దీనికి కారణమే వాదన ఉంది. వాస్తవానికి పామర్రు కాంగ్రెస్ కు గట్టి పట్టున్న నియోజకవర్గం. తదనంతర పరిణామాల్లో ఆ పార్టీ ఓట్లు వైసీపీకి మళ్లాయి.
ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా వైసీపీకే అనుకూలం. ఈ నేపథ్యంలో గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వంపై ఉన్నంతగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై పెద్దగా వ్యతిరేకత లేదు. దీంతో టీడీపీ అభ్యర్థి ప్రజాదరణ పొందేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంది. వీటన్నిటినీ పరిగణించి అధినేత తక్షణమే పరిశీలన చేపట్టాలని స్థానిక టీడీపీ కేడర్ కోరుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.