Begin typing your search above and press return to search.
టీడీపీ మాజీ మంత్రి రాజకీయాలకు దూరమేనా...?
By: Tupaki Desk | 23 Jun 2022 3:30 PM GMTటీడీపీ హయాంలో కీలక విషయాల్లో అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గా పేరు న్న నాయకుడు.. విద్యా వంతుడు.. మాజీ మంత్రి నారాయణ. అయితే.. ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం తీసుకు న్నారనే వాదన టీడీపీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించడం లేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత.. ప్రజల మధ్య ఉంటానని చెప్పినా.. విద్యా వ్యాపారంలో బబిజీ అయిపోయారు.
ఇక, ఇటీవల పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారం తెరమీదికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన కనిపించారు. ఆ సమయంలోనూ టీడీపీ ఆయనకు అండగా నిలిచింది. అయితే.. టీడీపీకి ఆయన దూరం అవుతున్నారనే సంకేతాలు మాత్రం బాహాటంగానే కనిపిస్తున్నాయి. పొరుగున ఉన్న ప్రకాశం జిల్లాలో మహానాడు నిర్వహిస్తే.. కనీసం .. ఆయన వచ్చి మాట్లాడింది లేదు. ఫండ్ కింద 10 లక్షలు ఇచ్చారని ఒక గుసగుస మాత్రం వినిపించింది.
అంతకు మించి ఆయన పాత్ర మహానాడులో కనిపించలేదు. ఇక, చంద్రబాబు జిల్లాల యాత్రకు రెడీ అవుతున్నా.. ఆయన స్పందించలేదు. మరోవైపు.. నియోజకవర్గంలో సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు.
మనకెందుకు.. మనకు రాజకీయాలకు పడవు! అనే వాదనను ఆయన తన మిత్రుల వద్ద చెబుతున్నారని తెలుస్తోంది. దీంంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉంటారని.. అసలు రాజకీయాలనే ఆయన వద్దనుకుంటున్నారని నాయకులు అంటున్నారు.
కానీ,, వాస్తవ పరిస్థితిని గమనిస్తే.. నారాయణ గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఇలాంటి వారు అవసరం అనే మాట మాత్రం వినిపిస్తోంది. ఇటీవల రాజధాని రైతులసమావేశం జరిగినప్పుడు.. నారాయణ ప్రస్తావన వచ్చింది. రాజధానిపై హైకోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు కూడా నారాయణ గురించి రైతులు చెప్పుకొన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. భూ సమీకరణ చేపట్టారని.. అలాంటి నాయకుడు అవసరమని రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయా లు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. ప్రజలు కూడా మార్పులు కోరుకుంటున్నారు. ఎంతసేపూ వివాదాలు.. సవాళ్లు చేసే నాయకులే కాకుండా.. తమ గురించి పట్టించుకునే నాయకుల కోసం.. కూడా వారు తపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ రాజకీయంగా పుంజుకోవాలని కోరుకుంటున్న వారు కూడా కనిపిస్తుండడం గమనార్హం. మరి ఆయన నిర్ణయం మార్చుకుంటారో లేదో చూడాలి.