Begin typing your search above and press return to search.
టీడీపీ ఖాళీ చేయాల్సిందే....?
By: Tupaki Desk | 7 Nov 2021 6:30 AM GMTరాజకీయాల్లో అవకాశాలు పుష్కక విమానం మాదిరిగా ఉంటాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అలా జరగదు. ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే మరో పార్టీ ఆ ప్లేస్ లోకి రావాలీ అంటే యుగాలూ జగాలే పడుతోంది. ఉదాహారణకు జాతీయ స్థాయిలో తీసుకుంటే కాంగ్రెస్ దశాబ్దాల తరబడి పాలించింది. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. నాడు బీజేపీ పరిస్థితి కేవలం రెండు లోక్ సభ సీట్లకే పరిమితం కావడంగా ఉండేది. అయితే బీజేపీ అవిశ్రాంతంగా పనిచేసి కాంగ్రెస్ ని నెట్టేసి మరీ ముందుకు వచ్చింది. ఇపుడు కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోంది అంటే ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్రమించడం వల్లనే. ఇక ఏపీలో తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి పదేళ్ళ వయసు కలిగిన వైసీపీ అయితే మరోటి నాలుగు దశాబ్దాల టీడీపీ.
ఈ రెండు పార్టీలు ఉండగా మూడవ పార్టీ ఆ స్పేస్ ని ఆక్రమించడం కష్టం. ఇక ఈ రెండు పార్టీలలో ఒకటి మెల్లగా అదృశ్యం కావాలి. మరి ఆ పరిస్థితి ఉందా. ఉంటే దేనికి ఉంది అంటే నడి వయసులో పడిన టీడీపీకే ఉంది అన్నది ఒక అంచనా. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఏడు పదుల వయసు దాటి ఉన్నారు. ఆయన తరువాత రాజకీయ వారసత్వం కూడా బలంగా లేదు. దాంతో 2024 ఎన్నికలు ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీకి చావో రేవో లాంటివే. ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ గెలిచి నిలవకపోతే కచ్చితంగా ఆ పార్టీ ఉనికి కోల్పోతుంది. దాంతో బీజేపీ తన టార్గెట్ ని టీడీపీ మీద పెట్టింది అంటున్నారు.
నిజానికి 1983 ముందు చూసుకుంటే ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ బాగా బలపడింది. ఆ తరువాత విడిపోయి బీజేపీగా అవతరించింది. నెమ్మదిగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎదుగుతున్న నేపధ్యంలో 83లో ఎన్టీయార్ టీడీపీని ఏర్పాటు చేయడంతో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. అలా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీ ఉనికి పోరాటం చేస్తూనే ఉంది. ఇపుడు టీడీపీ నెమ్మదిగా తగ్గుతోంది. ఒక విధంగా చాలా ఇబ్బందులో ఉంది. అటువంటి పార్టీని తనంతట తానుగా క్షీణింపచేయడమే బీజేపీ ఆలోచన. అలా కాకుండా పొత్తుల పేరిట మరోమారు చేరదీస్తే కచ్చితంగా టీడీపీ బలపడుతుంది. అన్నీ కలసి వస్తే బాబు తరువాత రాజకీయ నాయకత్వం కూడా బలంగా మారుతుంది. అపుడు టీడీపీని ఏపీ పొలిటికల్ తెర మీద నుంచి తొలగించాలీ అంటే కచ్చితంగా మరిన్ని దశాబ్దాలు పడుతుంది.
అందుకే అంది వచ్చిన ఈ అవకాశాన్ని బీజేపీ తెలివిగా వాడుకోవాలనుకుంటోందిట. తెలంగాణాలో కాంగ్రెస్ నిర్వీర్యం అయితే తమకు అక్కడ స్పేస్ దొరుకుతుంది అని ఆశిస్తున్న బీజేపీ అదే తరహాలో ఏపీలో టీడీపీ క్రమంగా బలహీనపడాలని ఆశిస్తోంది. 2024 ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్ష కానీ బీజేపీకి కావు. ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా కూడా దక్కేవి మూడో నాలుగో సీట్లు. వాటికి కక్కుర్తి పడి టీడీపీని బలోపేతం చేయడం కమలనాధుల అజెండా కానే కాదు అంటున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో టీడీపీతో ఏ రకమైన పొత్తులు లేకుండానే తాము వేరుగా ఉండాలనే ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారుట. అలా టీడీపీ కనుమరుగు అయితే ఆ ప్లేస్ లోకి తాము రావచ్చు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్. అదే కనుక నిజమైతే మాత్రం ఏపీలో టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.