Begin typing your search above and press return to search.
సీఎంపై ప్రివిలేజ్ నోటిస్ ఇచ్చిన టీడీపీ..ఎందుకంటే ?
By: Tupaki Desk | 17 Dec 2019 8:16 AM GMTఆంధ్రప్రదేశ్ లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలలో టీడీపీ - వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఇదే వ్యవహారం సభలో కొనసాగుతుంది. దీనితో అసెంబ్లీ లో రచ్చ చేస్తున్న టీడీపీ నేతలపై సీఎం జగన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు బఫూన్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
దీనితో సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత , ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి తమను మమల్ని సీఎం బఫూన్లు అని అంటున్నారు...మేము బఫూన్లైతే...సీఎం జగన్ ఏంటి... బఫూన్ల కంటే పెద్ద పదం వాడాల్సి వస్తుందంటూ చంద్రబాబు మాట్లాడారు. అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చూపుతున్నారని , టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని , రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆరోపించారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అలాగే ప్రభుత్వాన్ని విమర్శించినవారి ఆర్థికమూలాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇది కొత్త తరహా దాడులని.. చరిత్రలో ఎప్పుడూ జరగలేదని బాబు అన్నారు. అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారని, మీడియా గొంతు నొక్కేశారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పై గతంలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన టీడీపీ..ఇప్పుడు మరోసారి సీఎంతో సహా మంత్రుల పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. నిన్న శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. బఫూన్‌లంటూ సీఎం అభ్యంతరకర భాష వాడటంపై ఈ నోటీసులు ఇచ్చారు. గత వారం ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్ ను ఉద్దేశించి చేయని వ్యాఖ్యలు చేసారంటూ..సీఎం సభను తప్పుదోవ పట్టించారంటూ ఇప్పటికే టీడీపీ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. ఇప్పుడు సీఎం అభ్యంతరకర భాష వాడారని మరో నోటీసు అందించింది.