Begin typing your search above and press return to search.
ఆ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఫిరాయింపులపై మాట్లాడటమా!
By: Tupaki Desk | 31 July 2019 12:31 PM GMTతెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లలో సాగించిన ఫిరాయింపు రాజకీయాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ఎడా పెడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఆ ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు కూడా అసహ్యించుకున్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడాన్ని ఏపీ ప్రజలు ఆమోదించలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అంతగా చిత్తు అయిపోవడానికి కారణాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం కూడా ముఖ్యమైనదే అని విశ్లేషకులు అభిప్రాయపడతారు.
ఈ అంశం గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. తాము చంద్రబాబులా ఫిరాయింపులను ప్రోత్సహించేది ఉండదని జగన్ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు తరహాలో రాజకీయం చేసేది ఉండదని జగన్ తేల్చి చెప్పారు. అది ఆహ్వానించదగిన అంశం. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా అభినందనీయులు.
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆ పార్టీకే మంచిదే. వైఎస్ ఆర్ సీపీకి ఫిరాయింపులను నిరసించే అర్హత కచ్చితంగా ఉంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ అంశం గురించి మాట్లాడకూడదు. వారు మాట్లాడితే టీడీపీకి కూడా ఆయుధంగా మారుతున్నారు.
అలాంటి వారిలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఒకరు. సభలో ఫిరాయింపు రాజకీయాలపై చర్చలో ఆయన మాట్లాడారు. దీంతో సభ బయట తెలుగుదేశం ఘాటుగా స్పందించింది. 'అన్నా రాంబాబు ఎన్ని పార్టీలు మారాడో ఎవరికీ తెలీదు - ఆయన ఫిరాయింపుల గురించి మాట్లాడటమా?' అంటూ తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు.
అన్నారాంబాబు తెలుగుదేశం - ప్రజారాజ్యం - కాంగ్రెస్ - తిరిగి తెలుగుదేశం ఆ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.
ఇదే పాయింట్ మీదే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ బదులు ఇవ్వలేకపోయింది. శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తద్వారా ఫిరాయింపులను నిరసించే అర్హత ఆయనకు బాగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.