Begin typing your search above and press return to search.

మైదుకూరు సీటు ఎవరిది... టీడీపీ గుస‌గుస‌...!

By:  Tupaki Desk   |   1 Jan 2023 6:00 AM GMT
మైదుకూరు సీటు ఎవరిది...  టీడీపీ గుస‌గుస‌...!
X
మైదుకూరు. క‌డ‌ప‌జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి పార్టీలు వేరైనా.. ఇద్ద‌రే వ్య‌క్తులు.. ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు.. ఒక్కొక్క‌సారి వ‌రుస‌గానూ..గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. వారే.. డీఎల్ ర‌వీంద్రారె డ్డి, శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి. 1978 నుంచి ఈ ఇద్ద‌రే ఇక్క‌డ ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పుతున్నారు. టీడీపీ త‌ర‌ఫున శెట్టిప‌ల్లి 1985, 1999 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో ఈయ‌న వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు.

మ‌రోవైపు.. డీఎల్ ర‌వీంద్రారెడ్డి తొలినాళ్ల‌లో ఇండిపెండెంట్‌గా గెలిచి..త‌ర్వాత కాంగ్రెస్‌తీర్థం పుచ్చుకున్నా రు. మొత్తంగా డీఎల్‌.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. పార్టీలు ఏవైనా కూడా శెట్టిప‌ల్లి, డీఎల్‌ల మ‌ధ్యే మైదుకూరు రాజ‌కీయం న‌డిచింది. ఎమ్మెల్యేలుగా వీరే చ‌క్రం తిప్పారు. తిప్పుతు న్నారు కూడా! అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ తాజాగా తెర‌మీదికి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం టీడీపీ అభ్య‌ర్థిగా.. అంటే ఇంచార్జ్‌గా టీటీడీ మాజీ చైర్మ‌న్‌ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. 2014, 2019లో సుధాక‌ర్‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. కానీ, ఆయ‌న‌చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అయితే.. ఈయ‌న‌కు టీడీపీలో నెంబ‌ర్ 2గా పిలుచుకునే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స్వ‌యానా వియ్యంకుడు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అదృష్టం ప‌రిశీలించుకునే ప‌నిలో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

కానీ, పుట్టాకు మ‌ళ్లీ టికె ట్ఇవ్వ‌డం అంటే.. కోరి కోరి వైసీపీకి ఇక్క‌డ విజ‌యాన్ని ప‌సిడి ప్లేట్‌లో అందించ‌డ‌మేన‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే డీఎల్ ఊసు జోరుగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈయ‌న వైసీపీలో ఉన్న‌ట్టుగా చెబుతున్నా.. అలాంటిదేమీ లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. ఈయ‌న‌ను టీడీపీ సైకిల్ ఎక్కించుకుని టికెట్ ఇస్తే.. మైదుకూరులో సైకిల్ ప‌రుగు ప్రారంభ‌మ‌వుతుంద‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు.

అయితే, య‌న‌మ‌ల వంటిబ‌ల‌మైన నాయ‌కుడి వియ్యంకుడిని కాద‌ని.. చంద్ర‌బాబు ఇంత సాహ‌సం చేయ‌గ‌ల‌రా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. గెలిచినా ఓడినా య‌న‌మ‌ల‌ను సంతృప్తిప‌రిచేందుకు పుట్టాకు టికెట్ ఖాయ‌మ‌ని చెబుతున్నారు అయితే.. కొంద‌రుమాత్రం ఈ సారి కూడా ప్ర‌భుత్వం వ‌స్తే టీటీడీ చైర్మ‌న్ పోస్టును మ‌ళ్లీ పుట్టాకే ఇచ్చి.. డీఎల్‌కు చాన్స్ ఇవ్వొచ్చ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మైదుకూరు టీడీపీ టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.