Begin typing your search above and press return to search.
ఆత్మరక్షణలో టీడీపీ!
By: Tupaki Desk | 31 Jan 2022 6:36 AM GMTతెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. గుంటూరులో వైసీపీ కార్యకర్త ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారంటు టీడీపీ ఆరోపణలు చేసింది. అంతకుముందు నుండే గుడివాడలో క్యాసినో జరిగిందంటూ ఎంత గోల చేస్తోందో అందరికీ తెలిసిందే. మహిళలపై వైసీపీ నేతల అత్యాచారాలకు నిరసనగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపేందుకు అందరూ రెడీ అయ్యారు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే విజయవాడలో టీడీపీ సినియర్ నేత వినోద్ జైన్ దెబ్బకు బాలిక ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. వినోద్ జైన్ దెబ్బకు పార్టీ నేతలు ఎవరు మీడియా ముందుకు రావటం లేదు. ఈ పరిస్ధితుల్లో గుంటూరుకు వెళ్ళే నేతలు లేరు. గుడివాడ క్యాసినో గురించి ఎవరు మాట్లాడటంలేదు. పార్టీ ఆఫీసులో జరపాలని అనుకున్న నారీ సంకల్ప దీక్ష నిరసన కార్యక్రమం కూడా వాయిదా పడినట్లే ఉంది. ఎందుకంటే పార్టీలో ఇపుడీ కార్యక్రమం గురించి ఎవరు మాట్లాడటం లేదు.
ఎక్కడ ఏ ఘటన జరిగినా వైసీపీకి వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా రెచ్చిపోయే వర్ల రామయ్య, దేవినేని ఉమ, బోండా ఉమ అసలు అడ్రస్సే లేరు. ఇక తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ దమ్ము, ధైర్యముంటే వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలంటూ చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు దమ్ము ఏమిటి ధైర్యం ఏమిటి?
తప్పు చేసిన వారిని శిక్షించేందుకు కావాల్సింది అందుకు తగ్గ ఆధారాలు మాత్రమే. దర్యాప్తులో చిత్తశుద్ది ఉంటే చాలు తప్పు చేసిన వారికి శిక్షలు పడతాయి. కాకపోతే వాళ్ళ అదృష్టం కొద్దీ తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఏదేమైనా విజయవాడ వినోద్ జైన్ దెబ్బకు టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయిందనేది వాస్తవం. తప్పులు చేసేవారు వ్యక్తిగత హోదాలో చేస్తారే కానీ పార్టీ దన్నుచూసుకుని చేయరు. ఇపుడు జైన్ కూడా అలాగే చేసినట్లుంది. కాకపోతే లోకల్ టీడీపీ నేత కాబట్టే ఇపుడింతగా గొడవ జరుగుతోంది.