Begin typing your search above and press return to search.

కోర్టుకు భ‌య‌ప‌డి కౌలు ఇచ్చేశారా ?

By:  Tupaki Desk   |   29 Jun 2022 7:30 AM GMT
కోర్టుకు భ‌య‌ప‌డి కౌలు ఇచ్చేశారా ?
X
ఏటా ప‌ది శాతం కౌలు పెంపుతో రైతుల‌ను ఆదుకుంటున్నామ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేశ్ చెబుతుంటే, ఆ పాటి మొత్తాలుకూడా కోర్టు చెబితేనే మీరు ఇస్తున్నారు అని టీడీపీ విమర్శిస్తోంది. రాజ‌ధాని భూముల‌కు సంబంధించి మ‌ళ్లీ వివాదాలు రేగుతున్న త‌రుణంలో తాజాగా కాస్త వైసీపీ మాన‌వ‌త‌ను చూపి, కౌలు రైతుల‌కు సంబంధిత మొత్తాల‌ను (వార్షిక కౌలు పేరిట చెల్లించాల్సిన మొత్తాల‌ను ) విడుద‌ల చేసి, ఆదుకోవ‌డం బాగానే ఉంద‌ని, ఈ పాటి చిత్త శుద్ధి రాజ‌ధాని ప‌నుల‌పై కూడా చూపాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో వివాదాల్లో ఉన్న భూములు, విచార‌ణ‌లో ఉన్న భూములు మిన‌హాయించి మిగ‌తావాటికి సంబంధించి రాజ‌ధాని రైతుల‌కు కౌలు చెల్లించారు. వార్షిక కౌలు కింద 184కోట్ల రూపాయ‌లు చెల్లించారు.

రెండు విడ‌త‌ల్లో ఈ మొత్తాన్ని సీఆర్డీఏ చెల్లించింది. కోర్టు లో విచార‌ణ‌కు రానున్నందున జ‌గ‌న్ స‌ర్కారు ముందుగా నే అప్ర‌మ‌త్తం అయింది. ఒక నెల ఆల‌స్యంగా అయినా డ‌బ్బులు చెల్లించి 23 వేల మంది రైతుల‌కు న్యాయం చేయ‌డం బాగుంది. కానీ వాస్త‌వానికి ఈ కౌలు చెల్లింపుల్లో మొద‌ట్నుంచి వివాదాలే న‌డుస్తున్నాయి.

గ‌త ఏడాది కూడా ఇదే విధంగా ఆల‌స్యంగానే కౌలు చెల్లించి త‌రువాత వైసీపీ స‌ర్కారు గండం నుంచి గ‌ట్టెక్కింది. అప్పుడు కూడా ఇంతేమొత్తంలో నిధులు విడుద‌ల చేసింది. మ‌రోవైపు కౌలు చెల్లింపుల‌కు సంబంధించి టీడీపీ ఓ పిటిష‌న్ వేయాల‌ని చూసింది.

అనుకున్న‌విధంగా కోర్టు లో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. పిటిష‌న్ విచార‌ణ‌కు రాక మునుపే స‌ర్కారు మేల్కొల్పుతో సమ‌స్య ఈ ఏడాది కి సంబంధించినంత వ‌ర‌కూ పరిష్కారం అయింది. మున్ముందు కూడా ఇదే విధంగా చేస్తారో లేదో అన్న సంశ‌యాలు అయితే ఉన్నాయి.

మ‌రోవైపు రాజ‌ధాని కోసం సేక‌రించిన భూ ములు అమ్మేందుకు లేద‌ని చంద్ర‌బాబు స‌హా ఇత‌ర నాయ‌కులు అంటు న్నారు. కానీ ఇవ‌న్నీ త‌ప్పు అని అంటున్నారు మంత్రి ఆదిమూల‌పు సురేశ్. ఓ ప్ర‌భుత్వం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇటువంటివి చేయ‌వ‌చ్చు అన్న అర్థం వ‌చ్చే విధంగానే వైసీపీ వ‌ర్గాలు కూడా మాట్లాడుతున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఈ వాద‌న‌ను తోసిపుచ్చుతోంది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అని చెప్పి 3 ప్రాంతాల‌ను నిలువునా ముంచారు అని ఆరోపిస్తోంది.