Begin typing your search above and press return to search.
వైఎస్సార్ ని పొగుడుతున్న టీడీపీ... ఇంటెరెస్టింగ్
By: Tupaki Desk | 15 Sep 2022 5:01 AM GMTవైఎస్సార్ ఏపీకి ముఖ్యమంత్రిగా అయిందుంపావు ఏళ్ళు ఏలారు. ఆయన టీడీపీతోనే అసెంబ్లీ లోపలా బయటా పోరాటం చేశారు. ఆయనకు చంద్రబాబుకు మధ్య ఎంత స్నేహం ఉందో అంతకు మించిన రాజకీయ వైరం ఉంది. అయితే దాన్ని వ్యక్తిగతానికి కాకుండా ఇద్దరు నాయకులు జాగ్రత్త పడ్డారు. అందువల్లనే వైఎస్సార్ జమానాలో టీడీపీ ధీటైన ప్రతిపక్షంగా నిలిచింది. నాడు కూడా విపక్షం మీద ఘాటైన విమర్శలు, వారిని అడ్డుకోవడాలు ఉన్నా అవి ఒక స్థాయికే పరిమితం అయ్యాయి.
ఎక్కడా ఏనాడూ అవి హద్దు మీరలేదు. కానీ ఇపుడు మాత్రం టోటల్ సీన్ మారిపోయింది. ఏపీలో వైసీపీ వచ్చిన తరువాత టీడీపీకి సరికొత్త రాజకీయ పాఠాలను నేర్పిస్తోంది. ఒక విధంగా వైసీపీ ఎత్తుగడలను తట్టుకోవడం కూడా ఒక దశలో టీడీపీకి కష్టమైపోయిన స్థితి ఉంది. ప్రతిపక్షం అంటే డోంట్ కేర్ అన్నట్లుగా ఎవరికీ స్పేర్ చేసేది లేదు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుతో టీడీపీ ఖంగు తింటోంది. అదే టైంలో తాను అనుకున్నట్లుగానే వైసీపీ చేసుకునిపోతోంది.
ట్రెడిషనల్ పాలిటిక్స్ కి దాదాపుగా చెక్ పెట్టేసింది. నిజనైకి ప్రభుత్వం అంటే అది నిరంతరం సాగే వ్యవహారం. ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చి అయిదేళ్ళ పాటు పాలిస్తుంది. ఆ సమయంలో ఆ పార్టీ చేసి పోయిన, మధ్యలో మిగిల్చి పోయిన వాటిని తదుపరి ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఎందుకంటే అయిదేళ్ళ స్వల్ప కాలపరిమితిలో ఏ భారీ ప్రాజెక్టులు పూర్తి కావు. అవి దశాబ్దాల కాలం పాటు కొనసాగుతాయి.
ఇక రాష్ట్రానికి సంబంధించి కీలకమైన విషయాలు. శాశ్వత ప్రాజెక్టుల విషయంలో పార్టీలు ఏవైనా కూడా అవి ఒకే మాట మీద నడచుకుంటాయి. అక్కడ పార్టీల కంటే ప్రభుత్వం అన్న దాన్నే చూస్తాయి. అలా ఇప్పటిదాకా ఉమ్మడి ఏపీలో సాగుతూ వచ్చింది. నాడు చంద్రబాబు హయాంలో మొదలెట్టిన అనేక ప్రాజెక్టులను తరువాత వచ్చిన వైఎస్సార్ అలాగే పూర్తి చేశారు.
కానీ జగన్ ఏపీకే అత్యంత ముఖ్యమైన రాజధానినే రూపురేఖలు మార్చేందుకు సిద్ధపడడంతో టీడీపీకి మండిపోతోంది. చేతనైంతే దాన్ని మరింతంగా అభివృద్ధి చేసి ఏపీ ప్రజలకు ఒక రాజధానిని చూపించాలని అలా కాకుండా దాన్ని లేకుండా చేయడమో లేక ఉన్న దాన్ని తగ్గించడమో చేయడమేంటి అని టీడీపీ తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు.
దీని మీద ఈ మధ్య జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాల్లో చంద్రబాబు కూడా మండిపడ్డారు. వైఎస్సార్ చాలా నయమని, ఆయన తాను మొదలెట్టిన అనేక ప్రాజెక్టులను ఒక రూపు రేఖ దిద్ది పూర్తి చేశారని కొనియాడారు. వైఎస్సార్ విపక్షం అని రాజకీయం చేయకుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేవారని కూడా బాబు పేర్కొన్నారు.
ఇపుడు అదే మాటను విశాఖకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా అంటున్నారు. చంద్రబాబు చేసిన తప్పేంటి, అమరావతి రాజధానిని ఆయన అద్భుతంగా చేయాలనుకున్నారు. దాన్ని మార్చి మూడు రాజధానులు అని జగన్ రెడ్డి వితండ వాదన చేయడం తగునా అని ప్రశ్నించారు. వైఎస్సార్ తమ ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పధకాలను కొనసాగించారని అయ్యన్న గుర్తు చేసుకున్నారు. ఆయన గుణాలలో ఒక్కటైనా జగన్ కి వచ్చిందా అని మాజీ మంత్రి నిలదీయడం ఇక్కడ విశేషం.
మొత్తానికి గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్ అన్నట్లుగా వైఎస్సార్ హయాంలో ఆయనతో ఢీ అంటే ఢీ అంటూ సమరం సాగించిన టీడీపీకి ఇపుడు జగన్ రూపంలో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదురుకావడంతో తండ్రే నయం అన్న మాట వస్తోంది. నిజానికి ఇది చిత్రంగా ఉన్నా టీడీపీ వారు మాత్రం ఇదే అంటున్నారు. వైఎస్సార్ దార్శనీకుడు అని, రాజకీయం కంటే ఆయన అభివృద్ధిని కోరుకునేవారని కూడా కీర్తిస్తున్నారు.
మొత్తానికి జగన్ రాజకీయాల్లోకి వచ్చి సాధించిన అతి పెద్ద విజయం ఏంటి అంటే వైఎస్సార్ ని బతికుండగా ఏనాడూ ఏ కోశానా మెచ్చుకోని టీడీపీ వారు ఇపుడు పదే పదే ఆయన్ని తలచుకోవడం, అంతే కాదు, ఆయన పాలన చాలా బాగుందని మెచ్చడం. జగన్ని పోల్చి విమర్శించడానికైనా కూడా వైఎస్సార్ ని టీడీపీ మెచ్చుకోవడం అంటే వెరీ ఇంటరెస్టింగ్ అనే అంటున్నారు అంతా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.